‘ముస్లింలు, క్రైస్తవులు.. అంతా హిందువులే’: మోహన్ భగవత్

Published on Wed, 11/19/2025 - 13:03

గౌహతి: రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్ (ఆర్‌ఎస్‌ఎస్‌)చీఫ్ మోహన్ భగవత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూ మతాన్ని కేవలం మతపరమైన అర్థాలలో చూడకూడదన్నారు. ఇది అందరినీ కలుపుకునిపోయే సంస్కృతి అంటూ గౌహతిలో జరిగిన మేధావుల సమావేశంలో ఆయన వ్యాఖ్యానించారు.

దేశంలోని ముస్లింలు, క్రైస్తవులు వారి ఆచారాలను వదులుకోవాల్సిన అవసరం లేదని, అయితే వారు ఈ దేశాన్ని ఆరాధించాలని, భారతీయ సంస్కృతిని అనుసరించాలన్నారు. దేశానికి చెందిన పూర్వీకుల పట్ల గౌరవభావం కలిగి ఉండాలన్నారు. ఇలాంటి లక్షణాలు ఉన్నవారంతా హిందువులేనని భగవత్ స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన ‘పంచ పరివర్తన’ గురించి వివరించారు. సామాజిక సామరస్యం, కుటుంబ పరిరక్షణ వాటిలో ప్రధానమైనవన్నారు. పౌర క్రమశిక్షణ, స్వావలంబన, పర్యావరణ పరిరక్షణ కూడా అంతే ముఖ్యమన్నారు.

కుటుంబ వ్యవస్థను బలోపేతం చేయాలని ఆయన కోరారు. పూర్వీకుల సంప్రదాయాలను కాపాడుకోవాలని కుటుంబాలకు పిలుపునిచ్చారు. ఇది యువతలో సాంస్కృతిక గౌరవాన్ని పెంచుతుందన్నారు. స్వాతంత్ర్య పోరాటంలో ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్రను ఆయన గుర్తు చేసుకున్నారు. డాక్టర్ హెడ్గేవార్ జైలు శిక్షను ప్రస్తావించారు. దేశ నిర్మాణం కోసం నిస్వార్థంగా పనిచేయాలని మోహన్‌ భగవత్‌ కోరారు. ఈశాన్య ప్రాంతాన్ని భిన్నత్వంలో ఏకత్వానికి ఉదాహరణగా అభివర్ణించారు. 

ఇది కూడా చదవండి: ‘ప్రిన్స్’ విందులో.. ట్రంప్ ‘పుత్రోత్సాహం’

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)