Breaking News

కర్ణాటకలో మైనారిటీ ఇళ్లపైకి బుల్డోజరా?

Published on Sun, 12/28/2025 - 05:32

బనశంకరి: కర్ణాటక, కేరళ మధ్య తాజాగా చిచ్చు రేగింది. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభు­త్వం బుల్డోజరుతో ముస్లింల ఇళ్లను నేలమట్టం చేశారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌ ఆరోపించడమే కారణం. బెంగళూరు యలహంకలోని కోగిలు లేఅవుట్‌ వద్ద ప్రభుత్వ స్థలాల్లో అక్రమంగా నిర్మించిన ఇళ్లను గ్రేటర్‌ బెంగళూరు అథారిటీ అధికారులు నాలుగు రోజుల క్రితం కూల్చివేశారు. 

ఈ విషయమై విజయన్‌ శుక్రవారం సోషల్‌ మీడియాలో పోస్టు చేశారు. బెంగళూరు ఫకీర్‌ కాలనీ, వసీం లేఅవుట్‌లో కొన్నేళ్లుగా నివాసం ఉంటున్న ముస్లింల ఇళ్లను బుల్డోజర్‌తో ధ్వంసం చేయడం దిగ్భ్రాంతికరమన్నారు. ఉత్తరప్రదేశ్‌లో సంఘపరివార్‌ సర్కారు అనుసరిస్తున్న మైనారిటీ వ్యతిరేక ధోరణి కర్ణాటకలో కూడా కనిపిస్తోందన్నారు. కాంగ్రెస్‌ కపట ప్రవృత్తిని సెక్యులర్‌ ప్రజాస్వామ్య శక్తులు ఏకమై ఎండగట్టాలన్నారు.  

రాజకీయ జిమ్మిక్కులు వద్దు: డిప్యూటీ సీఎం డీకే 
కేరళలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో పినరయి విజయన్‌ రాజకీయ జిమ్మి­క్కులు చేయవద్దని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ ధ్వజమెత్తారు. శనివారం ఆయన స్పందిస్తూ.. ‘‘సీనియర్‌ నేత పినరయి విజయన్‌ వాస్తవాలను తెలుసుకోకుండా మాట్లాడారు. కొందరు ప్రభుత్వ స్థలంలో అక్రమంగా నివాసం ఉండడంతో మా ఎమ్మెల్యేలు, అధికారులు వాటిని తొలగించామని చెప్పారు. 

మాకు బెంగళూరు గురించి బాగా తెలుసు.. ఎవరు ఇళ్లు కోల్పోయినా వారికి రాజీవ్‌గాంధీ వసతి గృహమండలి ద్వారా ఇళ్లు కేటాయిస్తాం. మేము బుల్డోజర్‌ పద్ధతిని ఉపయోగించలేదు’’ అని తెలిపారు. విజయన్‌ ఇక్కడి పరిస్థితిని అర్థం చేసుకోకుండా మాట్లాడడం సరికాదని, ఎవరైనా ప్రభుత్వ స్థలాలను ఆక్రమిస్తే వదిలేది లేదని డీకే స్పష్టం చేశారు.   

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)