Breaking News

ముస్లిం, హిందూ జంట ప్రేమ పెళ్లి, ఆ తర్వాతి కథ తెలిస్తే!

Published on Sat, 06/20/2026 - 15:07

ఉత్తరప్రదేశ్‌లోని బదౌన్ (Budaun) జిల్లాలో జరిగిన ఒక మతాంతర వివాహం, అనంతర పరిణామాలు చర్చనీయాంశంగా నిలిచాయి. ఈ  ప్రేమ వివాహం ఒక కుటుంబంలో సంబరాలకు దారి తీయగా, మరో కుటుంబంమాత్రం విచారంలో మునిగి పోయింది. ముస్లిం యువతి (హీరా నాజ్ బీ) హిందూ యువకుడిని (అతుల్) వివాహం చేసుకుని, హిందూ మతంలోకి మారి హిమాన్షీ కుమారిగా పేరు మార్చుకున్న 19 ఏళ్ల యువతికథ ఇది. దీనికి సంబంధించిన వీడియోలో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. 

ఇంతకీ ఏమైంది అంటే.. 2023లో హీరా నాజ్ బీ 10వ తరగతి చదువుతున్నప్పుడు వారి గ్రామానికి సమీపంలో అతుల్‌తో పరిచయం ఏర్పడింది. వారి పరిచయం కాస్తా ప్రేమగా మారింది. మూడేళ్ల తర్వాత, ఈ ఏడాది జనవరిలో వారు ఆర్య సమాజ్ ఆలయంలో రహస్యంగా వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత 'లివ్-ఇన్' సర్టిఫికేట్ తీసుకుని, ఆమె తిరిగి తన తల్లిదండ్రుల వద్దకి వెళ్ళిపోయింది.

అయితే ఈ విషయం యువతి ఇంట్లో తెలియడంతో ఆమె కుటుంబ సభ్యులు ఆమెను తీవ్రంగా కొట్టి, గదిలో బంధించారు.  దీంతో ఆమె 100 నంబర్‌కు డయల్ చేసి, తనకు ప్రాణభయం ఉందని పోలీసుల సహాయం కోరింది.మరోవైపు యువతి మైనర్ అని, అతుల్ ఆమెను ప్రలోభపెట్టాడని యువతి కుటుంబం  ఫిర్యాదు చేసింది.  అయితే, పోలీసులు ఇరు వర్గాలను స్టేషన్‌కు పిలిపించి విచారించారు.యువతి తాను మేజర్ (వయస్సు నిండిన వ్యక్తినని) అని, తన ఇష్టపూర్వకంగానే అతుల్‌తో వెళ్తానని  ఖరాఖండిగా తేల్చి చెప్పేసింది. చట్టప్రకారం ఆమె వయోజనురాలు కావడంతో, పోలీసులు ఆమె నిర్ణయానికే మొగ్గుచూపి వారిని కలిసి వెళ్ళడానికి అనుమతించారు.

 "> ఇదీ చదవండి : రూ. 18 కోట్ల మేయర్ కిడ్నాప్‌ డ్రామా : సంచలన ఆరోపణలు

 

అబ్బాయి కుటుంబం సంబరాలు
వీరి ప్రేమను ఆమోదించిన  అతుల్  కుటుంబ సభ్యులు, బజరంగ్ దళ్ సభ్యులసమక్షంలో  వీరిద్దిరికీ బదౌన్‌లోని ఖాటూ శ్యామ్ ఆలయంలో మళ్లీ  ఘనంగా వివాహం  జరిపించారు. హిందూత్వ సంస్థలు మరియు బజరంగ్ దళ్ సభ్యులు దీనిని 'ఘర్ వాప్సీ' (Ghar Wapsi) గా అభివర్ణించారు. ఆలయం వెలుపల జై శ్రీరామ్ నినాదాలు చేస్తూ, మిఠాయిలు పంచుకుంటూ, దాదాపు 300 మంది   తరలి ఇచ్చి నూతన వధువును చూడటానికి వచ్చారు. ఇది స్థానికంగా  ఆసక్తికరంగా మారింది.

అయితే ఈ పెళ్లి మూడు కిలోమీటర్ల దూరంలో ఉన్న జాస్మా గ్రామానికి చెందిన ముస్లిం ప్రజలు మౌనంగా ఉండిపోయారు.  ఒక రకమైన నిశ్శబ్దం,విచారం, ఆందోళన,నెలకొన్నాయి. తాము దీనిపై ఎలాంటి నిరసన వ్యక్తంచేసినా, తిరిగి తమపైనే చర్యలు లేదా పరిణామాలు ఉంటాయేమోననే భయంతో వారు మౌనంగా ఉండిపోయారు.

ఇదీ చదవండి: బీమా లేకుండానే చీప్‌గా కాంటాక్ట్ లెన్స్‌ : అమెరికన్‌ మహిళ సంబరం

అయితే అదృష్టవశాత్తూ ఈ ఉదంతంలో ఎలాంటి మతపరమైన ఘర్షణలు లేదా శాంతిభద్రతల సమస్యలు తలెత్తలేదు. కొత్త సెక్షన్ 69 ప్రకారం ఇటువంటి కేసుల్లో మేజిస్ట్రేట్ ముందు యువతి ఇచ్చే స్టేట్‌మెంట్‌కు మాత్రమే చట్టపరమైన విలువ ఉంటుందని, ఈ కేసులో యువతి మొదటి నుండి ఒకే మాటపై నిలబడటం వల్ల ఎలాంటి FIR నమోదు కాకుండానే వివాదం పరిష్కారమైందని అధికారులు తెలిపారు.

ఇక్కడ యువతి ముస్లిం, యువకుడు హిందూ కావడం వల్ల సమస్య సులువుగా ముగిసింది. ఒకవేళ పరిస్థితి దీనికి విరుద్ధంగా ఉండి ఉంటే (అంటే యువతి హిందూ, యువకుడు ముస్లిం అయితే) పరిస్థితి ఇంత ప్రశాంతంగా ఉండేది కాదు. హిందూ సంస్థలు దీనిని 'లవ్ జిహాద్' (Love Jihad) గా చిత్రీకరించి తీవ్రంగా నిరసనలు తెలిపేవి, అది శాంతిభద్రతల సమస్యగా మారేదని పేరు చెప్పడానికి ఇష్టపడని ఒక సీనియర్ పోలీసు అధికారి  అభిప్రాయపడ్డారు.

ఇదీ చదవండి: రూ. 3,800 కోట్ల గిఫ్ట్ : మురిసిపోయిన డొనాల్డ్‌ ట్రంప్‌
 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)