Breaking News

మునిగిన ముంబై.. అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌ను ముంచెత్తిన వరద నీరు.. వీడియో వైరల్‌

Published on Mon, 05/26/2025 - 16:28

ముంబై: ముంబై మునిగింది. దేశ ఆర్థిక రాజధాని వర్షాలతో అతలాకుతలమైంది. నైరుతి రుతు పవనాల ప్రభావంతో రాత్రి నుంచి ముంబైలో వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ముంబై మహానగరానికి వాతావరణ శాఖ రెడ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. కుండపోతవానకు నగరం నరకంలా మారింది. రవాణా స్తంభించి పోయింది.

రోడ్లు చెరువుల్లా మారడంతో వాహనదారులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ప్రధాన కూడళ్లలో భారీ ఎత్తున ట్రాఫిక్‌ నిలిచిపోయింది. ట్రాక్‌లపైకి వాన నీరు చేరడంతో రైల్వే సర్వీసుల్లో అంతరాయం ఏర్పడింది. మే 10న ప్రారంభమైన వర్లీ మెట్రో స్టేషన్‌కు వరదనీరు పోటెత్తింది.  

ఆ దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ట్రైన్‌ వచ్చే వరకు, వచ్చిన తర్వాత ట్రైన్‌ లోపలికి వెళ్లేందుకు వినియోగించే స్టేషన్ గేట్ల వరకు మాత్రమే కాకుండా ప్లాట్‌ఫామ్‌లను నీరు ముంచెత్తింది. వెలుగులోకి వచ్చిన ఆ వీడియోల్లో ప్లాట్‌ ఫామ్ పూర్తిగా బురద నీటితో నిండిపోయి ఉండటాన్ని చొడొచ్చు.

 

అంతేకాదు, మెట్రో లోపల తీసిన మరో వీడియోలో పైకప్పులో లీకేజీ కారణంగా ప్లాట్‌ఫారమ్‌పై నుండి నీరు ప్రవహించింది. భారీ ఎత్తున నీరు నిలిచిపోవడంతో మెట్రోసర్వీసులకు ఆటంకం ఏర్పడింది. అయితే, అండర్‌ గ్రౌండ్‌ మెట్రో స్టేషన్‌లో వరదకు కారణం డ్రైనేజీ వ్యవస్థ సరిగ్గా లేకపోవడమే కారణమని తెలుస్తోంది.  

ముంబై మూడు లైన్ల అండర్‌గ్రౌండ్‌ మెట్రోస్టేషన్‌ను బాంద్రా-కుర్లా కాంప్లెక్స్ (BKC) నుండి వర్లిలోని ఆచార్య అత్రే చౌక్ వరకు సేవల్ని అందిస్తోంది. ఈ మెట్రో సేవలు ఈ నెల ప్రారంభంలో మే 10న అందుబాటులోకి వచ్చాయి. ఇటీవలే ప్రారంభమైన మెట్రోస్టేషన్‌ను వరద నీరు ముంచెత్తడంతో మౌలిక సదుపాయాల గురించి ప్రశ్నలు తలెత్తాయి.

Videos

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)