Breaking News

Ganesh Chaturthi: మునిగిన విగ్రహాలకు ఫొటోలు తీయడంపై నిషేధం

Published on Tue, 09/02/2025 - 12:26

ముంబై: మహారాష్ట్రలోని ముంబైలో గణపతి నవరాత్రులు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. సెప్టెంబరు ఆరున  భారీ ఎత్తున వినాయక నిమజ్జనాలున్న తరుణంలో ముంబై పోలీసులు పలు నిషేధ ఉత్తర్వులు జారీ చేశారు. నిమజ్జనం తర్వాత పాక్షికంగా కరిగిన గణపతి విగ్రహాలకు ఫోటోలు తీయడం, ప్రచురించడం, ప్రసారం చేయడాన్ని నిషేధించారు. ఈ ఉత్తర్వు సెప్టెంబర్  ఏడు వరకు గ్రేటర్ ముంబై అంతటా అమలులో ఉంటుందని తెలిపారు.

గణపతి నిమజ్జనం అనంతరం నీటి అలలకు సగం కరిగిన విగ్రహాలు ఒడ్డుకు కొట్టుకువచ్చే  అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. ఇవి పలువురి మనోభావాలను దెబ్బతీస్తాయన్నారు. గతంలో ఇటువంటి విగ్రహాలను బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) కార్మికులు తిరిగి నిమజ్జనం చేస్తున్నప్పుడు ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో ప్రసారం అయ్యాయని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఫొటోలు, వీడియోలు మతపరమైన భావాలను దెబ్బతీస్తాయని, ప్రజా శాంతికి భంగం కలిగించే ప్రమాదం ఉందని పోలీసులు భావిస్తున్నారు.

ఎగ్జిక్యూటివ్ మేజిస్ట్రేట్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ఆపరేషన్స్) అక్బర్ పఠాన్ మాట్లాడుతూ నిమజ్జనం తర్వాత తేలియాడే లేదా సగం మునిగిపోయిన విగ్రహాల ఫోటోలు తీయడం, వాటిని ఏ రూపంలోనైనా ప్రచురించడం లేదా ప్రసారం చేయడాన్ని నిషేధిస్తున్నట్లు తెలిపారు. ఈ ఉత్తర్వులను ఉల్లంఘించిన వారిపై భారతీయ న్యాయ సంహిత కింద చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. నగరం అంతటా దీని గురించి ప్రచారం చేయాలని అధికారులను ఆయన కోరారు.

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)