Breaking News

రోడ్డుపై మహిళ డెలివరీ.. ఆస్పత్రికి తరలించిన పోలీసులు

Published on Sat, 09/21/2024 - 08:02

ముంబై: మహారాష్ట్రలోని ముంబై పోలీసులు తమలోని మానవత్వాన్ని చాటుకున్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళను ముంబై పోలీసు విభాగానికి చెందిన నిర్భయ స్క్వాడ్  వెంటనే ఆదుకుంది. ఆమెకు రోడ్డుపైనే డెలివరీ చేయించి, తల్లీ బిడ్డలను ఆస్పత్రికి తరలించింది. ప్రస్తుతం తల్లీబిడ్డా క్షేమంగా ఉన్నారు.

వివరాల్లోకి వెళితే ముంబైలోని డోంగ్రీ పోలీస్ స్టేషన్‌కు చెందిన నిర్భయ స్క్వాడ్ రోడ్డుపై 45 ఏళ్ల మహిళకు బిడ్డను ప్రసవించడంలో సహాయం చేసింది. ఆ తర్వాత ఆ మహిళను ఆమె నవజాత శిశువును జేజే ఆస్పత్రికి తరలించింది. డోంగ్రీలోని చార్ నల్ జంక్షన్‌లో ఫుట్‌పాత్‌పై ఓ మహిళ ప్రసవ నొప్పితో బాధపడున్నదని నిర్భయ స్క్వాడ్‌కు తెలిసిందని పోలీసు అధికారులు తెలిపారు. దీంతో వెంటనే స్క్వాడ్‌లో ఉన్న మహిళా పోలీసులు బాధితురాలిని ఆదుకునే ప్రయత్నం చేశారు. అంబులెన్స్ రావడానికి కొంత సమయం పట్టే అవకాశం ఉండటంతో వారు బాధిత మహిళ చుట్టూ కవర్‌ కట్టి, స్థానికుల సహాయంతో డెలివరీ చేశారు. ఈ మహిళకు పండంటి మగబిడ్డ జన్మించాడు. తరువాత పోలీసులు ఆ శిశువును, తల్లిని జేజే ఆస్పత్రికి తరలించారు. నిర్భయ స్క్వాడ్‌ను ముంబై పోలీస్ కమిషనర్ వివేక్ ఫన్సాల్కర్ అభినందించారు. 


 

ఇది కూడా చదవండి: సీల్‌కు రేబిస్.. తొలి కేసును గుర్తించిన శాస్త్రవేత్తలు

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)