Breaking News

ముప్పై ఏళ్ల తర్వాత పోలీసులకు చిక్కిన నిందితుడు

Published on Tue, 07/02/2024 - 17:14

ముంబై: ముప్పై ఏళ్ల క్రితం నాటి ముంబయి అల్లర్ల కేసులో పరారీలో ఉన్న ఓ నిందితుడు ఇప్పుడు మళ్లీ చిక్కాడు. అతడు గుట్టుచప్పుడు కాకుండా ఇంటికి వెళ్తుండగా పోలీసులు అరెస్టు చేశారు. 1993లో ముంబయిలో అలర్లు చెలరేగాయి.  అల్లర్ల సమయంలో చట్టవిరుద్ధంగా మనుషులను పోగు చేసిన కేసుతోపాటు ఓ హత్యలో సయ్యద్‌ నాదిర్‌ షా అబ్బాస్‌ ఖాన్‌ (65) అనే వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

అనంతరం అతడు బెయిల్‌పై విడుదలయ్యాడు. బెయిల్‌పై విడుదలైనప్పటి నుంచి కనిపించకుండా పోయి పరారీలో ఉన్నాడు. దీంతో కోర్టు అతడిని చట్టపరంగా పరారీలో ఉన్న నిందితుడిగా ప్రకటించి నాన్‌ బెయిలబుల్‌ వారెంట్ జారీ చేసింది. 

సెంట్రల్‌ ముంబయి సేవ్రీలోని నిందితుడి ఇంటికి పోలీసులు అనేకసార్లు వెళ్లినా అతడు ఎక్కడున్నాడో కనుక్కోలేకపోయారు. చివరకు బంధువుల ఫోన్ల రికార్డులను పరిశీలించగా ఆచూకీ లభ్యమైంది. 

జూన్ 29న అతడు తన ఇంటికి వెళ్తున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో  పోలీసులు వలపన్ని అతడిని అరెస్టు చేశారు. 1993 కేసులో నిందితుడిని తాజాగా మళ్లీ అరెస్టు చేశామని, కేసులో తదుపరి విచారణ కొనసాగుతుందనియ పోలీసులు తెలిపారు 

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)