Breaking News

monorail: క్రేన్‌ సాయంతో ప్రయాణికులు బయటకు..

Published on Tue, 08/19/2025 - 20:55

ముంబై: మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలకు అక్కడ పరిస్థితి దారుణంగా మారింది ప్రధానంగా మంగళవారం కురిసిన వర్షానికి అక్కడ జన జీవనం స్తంభించిపోయింది.  ఈ క్రమంలోనే ముంబైలోని చెంబూర్‌-భక్తిపార్క్‌ మధ్య నడిచే మోనో రైలు ఒకటి సాంకేతిక లోపంతో ట్రాక్‌పై నిలిచిపోయింది.  మెట్రో కంటే తక్కువ పరిమాణంతో పాటు ఎలివేటెడ్‌ ట్రాక్‌పై నడిచే మోనో రైల్లో చిన్నపాటి విద్యుత్‌ అంతరాయ ఏర్పడటంతో మంగళవారం సాయంత్రం సమయంలో ట్రాక్‌పైనే ఉన్నపళంగా ఆగిపోయింది.

సుమారు రెండు గంటలపాటు నిలిచిపోయిన మోనో రైలు ఘటనపై  సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌.. అక్కడకు చేరుకుని ప్రయాణికుల్ని క్రేన్ల సాయంతో కిందకు దించింది. అయితే  పవర్‌ సప్లైలో చిన్నపాటి అంతరాయం కారణంగానే ఆ ట్రైన్‌ నిలిచిపోయిందని అధికారులు స్పష్టం చేశారు. ఆ ట్రైన్‌ మరమ్మత్తు చర్యలను స్వల్ప వ్యవధిలోనే పూర్తి చేశామని తెలిపారు. 

అయితే ట్రైన్‌ ఉన్నపళంగా ట్రాక్‌పైనే నిలిచిపోవడంతో అందులో ఉన్న ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం వెంటనే అప్రమత్తమై సహాయక చర్యలు చేపట్టింది. ఈ ఘటనకు సంబంధించి విచారణకు ఆదేశించినట్లు ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌ తెలిపారు. అదే సమయంలో ట్రైన్‌లో ఉన్న ప్రయాణికులు ఎవరూ భయపడవద్దని విజ్ఞప్తి చేశారు.

 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)