Breaking News

Mumbai: నాయర్‌ ఆస్పత్రికి బాంబు బెదిరింపు.. రెండు రోజుల్లో మరో కాల్‌..

Published on Sun, 09/07/2025 - 13:06

ముంబై: మహానగరం ముంబై అంతటా 400 కిలోల ఆర్డీఎక్స్‌ మోసుకెళ్లే 34 మానవ బాంబులు అమర్చామంటూ రెండు రోజుల క్రితం వచ్చిన బెదిరింపు కాల్‌ను మరువకముందే ఇదే తరహాలో మరో బెదిరింపు కాల్‌ వచ్చింది. తాజాగా నగరంలోని నాయర్ ఆసుపత్రిలో  బాంబు  అమర్చినట్లు కాల్‌ రావడంతో ముంబై పోలీసులు అప్రమత్తమయ్యారు. ఆస్పత్రిని పేల్చివేయడానికి రంగం సిద్ధం చేసినట్లు హెచ్చరిక కాల్ అందిందని, వెంటనే భద్రతా దళాలు అప్రతమ్తమై బాంబుకోసం గాలింపు చర్యలు చేపట్టాయని పోలీసు అధికారులు తెలిపారు.

శనివారం రాత్రి 11 గంటలకు  డీన్ అధికారిక చిరునామాకు బాంబు బెదిరింపు ఈ మెయిల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు బాంబు గుర్తింపు, నిర్మూలన దళం (బీడీడీఎస్‌)తో కలిసి  ఆస్పత్రి క్షుణ్ణంగా తనిఖీ చేశారు. కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించాక ఎటువంటి అనుమానాస్పద వస్తువు లభ్యంకాలేదు. ముంబై అంతటా వాహనాలలో 400 కిలోల ఆర్డీఎక్స్‌ మానవ బాంబులు అమర్చామంటూ బెదిరింపు కాల్‌ వచ్చిన రెండు రోజులకు తాజా ఘటన జరిగింది. లష్కర్ ఎ-జిహాదీ’  సంస్థ నుండి ఈ బెదిరింపు కాల్‌ వచ్చింది.

మరోవైపు 10 రోజుల పాటు సాగిన గణేశ్‌ నవరాత్రుల ముగింపు సందర్భంగా మహారాష్ట్ర అంతటా, ముఖ్యంగా ముంబైలో పోలీసులు భద్రతను మరింతగా పెంచారు. నిమజ్జనం సందర్భంగా జనసమూహ నియంత్రణ, నిఘా కోసం 21 వేల మందికి పైగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇటీవలి కాలంలో ముంబైని లక్ష్యంగా  చేసుకుని బెదిరింపు కాల్స్, ఈ- మెయిల్స్‌ రావడం అధికమయ్యింది. సోమవారం కల్వా రైల్వే స్టేషన్‌ను పేల్చివేస్తామంటూ బెదిరింపు కాల్‌ చేసిన  43 ఏళ్ల వ్యక్తిని పోలీసులు అరెస్టు చేశారు.

Videos

మా ప్రభుత్వం వచ్చాక మొదటి ఆరు నెలలు నేనే హోం మంత్రి!

వల్లభనేని వంశీ సమక్షంలో టీడీపీ నుండి YSRCP లోకి భారీ చేరికలు

జగన్ అంటే బాబుకు వణుకు.. చేతకానప్పుడు ఓవర్ యాక్షన్ ఎందుకు?

ఈ రోజు కుట్రలు చేసి గెలవొచ్చు... రేపు గెలిచిన ప్రతి ఒక్కరు మీ అంతటా మీరే రాజీనామా చేసేలా..

రాయచోటిలో ఇది చీకటి రోజు.. గడికోట శ్రీకాంత్ రెడ్డి వార్నింగ్

యనమల కృష్ణుడికి జనసేన ఝలక్.. తుని చైర్మన్ అభ్యర్థిగా శ్రీలత

నారాసురుడి రక్తపాతం.. ఇంత పిరికిపందలు.. సీమలో ఎలా పుట్టారురా!

తిరగబడండి.. లేదంటే రాష్ట్రం బతకదు

బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ పై కాల్పులు.. షాకింగ్ వీడియో

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

Photos

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం...జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?