Breaking News

400 మీటర్లు.. 18,000 బిల్లు..

Published on Sat, 01/31/2026 - 08:01

మనం ‘అతిథి దేవో భవ’ అంటాం.. కానీ ఆ ట్యాక్సీ డ్రైవర్‌ మాత్రం అతిథి ‘దోపిడీ’భవ అనుకున్నాడు. వేల మైళ్ల దూరం నుంచి వచ్చిన ఒక అతిథిని, అడుగు దూరంలో ఉన్న హోటల్‌కు చేర్చడానికి అక్షరాలా పద్దెనిమిది వేల రూపాయలు పిండేశాడు. అమెరికా నుంచి ముంబై ఎయిర్‌పోర్ట్‌లో దిగిన ఒక మహిళకు ఎదురైన చేదు అనుభవమిది.  

ఆ 20 నిమిషాల ఉత్కంఠ 
జనవరి 12 అర్ధరాత్రి సమయం.. అమెరికా నుంచి ముంబైలో అడుగుపెట్టిన ఆ మహిళ ఒక ట్యాక్సీ ఎక్కింది. ఆమె వెళ్లాల్సిన ఫైవ్‌ స్టార్‌ హోటల్‌ ఎయిర్‌పోర్ట్‌కు కేవలం 400 మీటర్ల దూరంలోనే ఉంది. కానీ, ట్యాక్సీ డ్రైవర్‌ దేశ్‌రాజ్‌ యాదవ్‌ కన్ను ఆమె పర్సుపై పడింది. నేరుగా హోటల్‌కు తీసుకెళ్లకుండా, ఆమెకు దారి తెలియదు కదా.. అని అంధేరీ వీధుల్లో 20 నిమిషాల పాటు ‘చక్రం’ తిప్పాడు. కారులో డ్రైవర్‌ పక్కన మరో అపరిచిత వ్యక్తి.. చుట్టూ చీకటి.. ఆమెకు ఏం జరుగుతుందో అర్థం కాలేదు..  

చెక్‌ ఇన్‌ అవ్వకముందే.. భారీ చెక్‌! 
చివరికి హోటల్‌ ముందు కారు ఆపిన ఆ డ్రైవర్, బాంబు పేల్చాడు. బిల్లు ఎంతో తెలుసా? అక్షరాలా 18,000 రూపాయలు! అంటే కిలోమీటర్‌కు కూడా సరిపోని దూరానికి దాదాపు 200 డాలర్లు వసూలు చేశాడు. కొత్త దేశం, ఒంటరి మహిళ.. వాళ్లతో వాదించలేక, భయంతో ఆ డబ్బు చెల్లించి హోటల్‌లోకి పరుగులు తీసింది.

ట్విట్టర్‌లో పోస్టు.. ఖాకీల వేట 
అమెరికా చేరుకున్నాక ఆ బాధితురాలు జనవరి 26న ఎక్స్‌ వేదికగా తన గోడు వెళ్లగక్కింది. ఆమె కథనం ప్రకారం.. ట్యాక్సీ డ్రైవర్‌తో పాటు మరో వ్యక్తి బాధితురాలిని ఒక గుర్తు తెలియని ప్రాంతానికి తీసుకెళ్లారు. డబ్బులు ఇవ్వాలని బెదిరించి, ఆ తర్వాతే హోటల్‌ దగ్గర వదిలిపెట్టారు. ఆ పోస్ట్‌ చూసి నెటిజన్లు రగిలిపోయారు. ముంబై పోలీసులు వెంటనే స్పందించారు. ఎఫ్‌ఐఆర్‌ నమోదైన కేవలం 3 గంటల్లోనే ఆ కేటుగాడిని పట్టుకుని బేడీలు వేశారు. డ్రైవర్‌ లైసెన్స్‌ను రద్దు చేయడమే కాకుండా, అతని ట్యాక్సీని కూడా సీజ్‌ చేశారు. ఎక్కడైనా, ఎప్పుడైనా ఇలాంటి మోసానికి గురైతే ఆలస్యం చేయకుండా 112 కి కాల్‌ చేయండని డీసీపీ మనీష్‌ కల్వానియా విజ్ఞప్తి చేశారు. డబ్బు మీద ఆశతో దేశ గౌరవాన్ని తాకట్టు పెట్టిన ఆ మాయగాడికి, ముంబై పోలీసులు సరైన రీతిలో ‘మర్యాద’చేశారు! 
– సాక్షి, నేషనల్‌ డెస్క్‌.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)