Breaking News

ముంబై: మరో 48 గంటల్లో రుతుపవనాలు!

Published on Tue, 06/23/2026 - 09:46

ముంబై: ముంబై నగరవాసుల సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. గత కొంతకాలంగా మందగించిన నైరుతి రుతుపవనాలు మళ్లీ పుంజుకున్నాయి. రాబోయే 48 గంటల్లో రుతుపవనాలు ముంబై సహా మహారాష్ట్రలోని మరికొన్ని ప్రాంతాలకు విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. సోమవారం నగరంలో కురిసిన వర్షాలు ముందస్తు రుతుపవన జల్లులేనని స్పష్టం చేసిన అధికారులు, రానున్న రెండు రోజుల్లో అధికారికంగా రుతుపవనాల రాకను ప్రకటించే అవకాశం ఉందని తెలపడంతో తీవ్ర ఉక్కపోతతో అల్లాడుతున్న జనానికి పెద్ద ఊరట లభించినట్లయింది.

పుంజుకున్న రుతుపవనాలు
అరేబియా సముద్రం, బెంగాళాఖాతంలో బలహీనమైన వాతావరణ వ్యవస్థలు, ఎల్‌ నినో ప్రభావం వల్ల ఈ ఏడాది రుతుపవనాల రాక ఆలస్యమైంది. సాధారణంగా జూన్ 11 నాటికే ముంబైని తాకాల్సిన రుతుపవనాలు, గత వారం రోజులుగా మరింత మందగించాయి. అయితే, తాజా పరిణామాల ప్రకారం పశ్చిమ తీరం వెంబడి రుతుపవన వ్యవస్థ మళ్లీ బలాన్ని పుంజుకుంటోంది. ఇప్పటికే మహారాష్ట్ర, తెలంగాణ, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, జార్ఖండ్, బీహార్‌లలోని మరికొన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించాయని, రాబోయే రెండు రోజుల్లో ఈ పురోగతి మరింత వేగవంతం కానుందని వాతావరణ శాఖ పేర్కొంది.

వేగాన్ని నియంత్రిస్తున్న అల్పపీడనం
రుతుపవనాలు మళ్లీ కదిలినప్పటికీ, వాటి ప్రయాణం సాధారణం కంటే నెమ్మదిగానే సాగుతోందని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. సాధారణంగా ఈ సమయంలో వర్షాలను తీవ్రం చేసే బెంగాళాఖాతంలోని అల్పపీడన వ్యవస్థ ఇంకా ఏర్పడకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. జూన్ చివరి నాటికి మాత్రమే ఈ అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఆలస్యం కారణంగా ఉత్తర ప్రదేశ్, ఢిల్లీ వంటి ఉత్తరాది రాష్ట్రాలకు రుతుపవనాల రాక మరింత ఆలస్యమై, జూలై మొదటి వారంలో అక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉంది.

దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటు
ప్రస్తుతం దేశవ్యాప్తంగా వర్షపాత లోటు ఆందోళనకరంగానే ఉంది. ఈ సీజన్‌లో ఇప్పటివరకు సాధారణంగా కురవాల్సిన 106 మిమీ వర్షపాతానికి గానూ కేవలం 60.6 మిమీ మాత్రమే నమోదైంది. అంటే దేశవ్యాప్తంగా 43 శాతం వర్షపాత లోటు నెలకొంది. ఇందులో మధ్య భారతదేశం అత్యధికంగా 67 శాతం లోటుతో అతలాకుతలమవుతుండగా, తూర్పు, ఈశాన్య ప్రాంతాల్లో 40 శాతం, దక్షిణ భారతదేశంలో 28 శాతం, వాయువ్య భారతదేశంలో 15 శాతం మేర వర్షపాత లోటు నమోదైంది. రాబోయే 48 గంటల్లో ముంబైలోకి రుతుపవనాల ప్రవేశం దేశవ్యాప్త వర్షాలపై సానుకూల ప్రభావం చూపుతుందని భావిస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)