Breaking News

Bihar: ఎంపీ రెండు వేళ్లకూ సిరా గుర్తులు.. వీడియో వైరల్‌

Published on Sat, 11/08/2025 - 12:09

పట్నా: బీహార్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్నాయి. 6న మొదటి దశ పోలింగ్‌ జరిగింది. ఆరోజు ఓటువేసిన ఎల్‌జేపీ(రామ్ విలాస్) ఎంపీ శాంభవి చౌదరికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. దీనిని చూసినవారంతా తెగ ఆశ్చర్యపోతున్నారు. ఇది ఎలా సాధ్యం? అంటూ చర్చించుకుంటున్నారు.

బీహార్ శాసనసభ ఎన్నికల మొదటి దశలో ఓటు వేసిన తర్వాత ఎంపీ శాంభవి చౌదరి తన రెండు చేతి వేళ్లపై సిరా గుర్తులను చూపిస్తున్న వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అవుతోంది. ఇది డబుల్ ఓటింగ్, విధానపరమైన లోపాల ఆరోపణలకు ఆజ్యం పోసింది. పట్నాలోని బుద్ధ కాలనీలోని ఒక పోలింగ్ కేంద్రం వెలుపల చిత్రీకరించిన ఈ వీడియోలో ఎంపీ శాంభవి తన తండ్రి, జేడీయూ నేత అశోక్ చౌదరి, తల్లి నీతా చౌదరితో కలిసి కనిపిస్తున్నారు.
 

వీడియోలో ముందుగా ఆమె తన వేలిపై సిరా గుర్తును చూపేందుకు తన కుడి చేతి వేలిని చూపిస్తారు. తరువాత ఎడమ చేతి వేలిని చూపిస్తారు. ఈ వేలిపై కూడా  సిరా గుర్తు కనిపిస్తుంది. ఈ వీడియో వైరల్ కావడంతో పట్నా జిల్లా పరిపాలన అధికారులు ఒక ప్రకటన విడుదల చేశారు. సిరా గుర్తు వేయడానికి బాధ్యత వహించే పోలింగ్ సిబ్బంది పొరపాటున తొలుత కుడి చేతి వేలికి సిరాను పూసారని, అయితే ప్రిసైడింగ్ అధికారి జోక్యం చేసుకున్న తర్వాత, ఆమె ఎడమ చేతి వేలికి కూడా సిరాను రాశారని దానిలో స్పష్టం చేశారు. బుద్ధ కాలనీలోని పోలింగ్ స్టేషన్ నంబర్ 61లోని ఓటరు జాబితాలోని సీరియల్ నంబర్ 275లో మాత్రమే శాంభవి తన ఓటును వేశారని అధికారులు తెలిపారు. 

ఇది కూడా చదవండి: శీతాకాలం ఎఫెక్ట్‌: ‘ఇకపై 10కి ఆఫీసు’

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)