Breaking News

వయనాడ్‌ విలయాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి: రాహుల్‌

Published on Wed, 08/07/2024 - 18:34

ఢిల్లీ: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు మృత్యువాతపడ్డారు. అర్ధరాత్రి వరదల కారణంగా కొండచరియలు విరిగిపడిన ఘటన దేశ ప్రజలను దిగ్బ్రాంతికి గురిచేసింది. కాగా, ఆకస్మిక ప్రమాదాన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలని కేంద్రాన్ని లోకసభ ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ కోరారు.

ఇక, రాహుల్‌ గాంధీ బుధవారం పార్లమెంట్‌ సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా లోక్‌సభలో రాహుల్‌ మాట్లాడుతూ..‘వయనాడ్‌లో విషాదకర ఘటన జరిగింది. వరదల కారణంగా వయనాడ్‌లో కొండచరియలు విరిగిపడిన ప్రాంతాన్ని నేను సందర్శించాను. ఈ ఘటనలో వందల సంఖ్యలో ప్రజలు చనిపోయారు. చాలా మంది ఆచూకీ తెలియలేదు. వారి మృతదేహాలు కూడా దొరకలేదు. మృతుల సంఖ్య పెరిగే అవకాశాలున్నాయి. బాధితుల్లో కుటుంబంలోని సభ్యులందరినీ కోల్పోయి ఒంటరిగా మిగిలినవారు సైతం ఉన్నారు. ఇలాంటి సందర్భాల్లో కేంద్రం బాధిత కుటుంబాలకు అండగా నిలవాలి. 

 

 వరదల కారణంగా వయనాడ్‌లో కీలక రహదారులు కూడా పూర్తిగా దెబ్బతిన్నాయి. ఈ విపత్తును జాతీయ విపత్తుగా ప్రకటించాలి. వారికి ఇచ్చే పరిహారాన్ని పెంచి, బాధితులకు పునరావాసాన్ని కల్పించాలి. ప్రకృతి విపత్తు సంక్షోభ సమయంలో బాధితులకు సహాయం చేసిన వారికి కృతజ్ఞతలు అంటూ కామెంట్స్‌ చేశారు. ఇదే సమయంలో వయనాడ్‌లో సహాయక చర్యల్లో సహకరించిన కేంద్ర బలగాలు, సైనికులను ప్రశంసించారు. ఆపదలో అండగా కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాలను ప్రత్యేకంగా అభినందించారు. 

Videos

ఎవడికి చెప్పుకుంటావో చెప్పుకో.. పోలీస్ స్టేషన్ లో బాధితుడి గొంతు పట్టుకున్న ఎస్ఐ

ప్రభాకర్ తో మొదలైన ప్రకంపనలు.. ఇకనైనా బాబు, లోకేష్ నోరువిప్పుతారా ?

హైవేపై ఆయిల్ కాలువలు.. బిందెలతో ఎగబడ్డ జనం

ప్రకాశం జిల్లాలో లాకప్ డెత్..?

టీచర్ జాబ్స్ లో ట్విస్ట్.. లోకేష్ కు బిగ్ షాక్..!

ఎన్టీఆర్ కోసం క్యూ కడుతున్న బాలీవుడ్ స్టార్స్...

కడప జిల్లాలో పదో తరగతి అర్హతతో ఒక యువతికి టీచర్ పోస్టు..!

దగా DSCలో బడి దొంగల మొత్తం లిస్ట్ బయట పెట్టిన శేఖర్ రెడ్డి

ఎట్టకేలకు పట్టుకున్నారు

ఉత్తరాదిలో దంచికొడుతున్న వర్షాలు..

Photos

+5

‘టార్టాయిస్’ మూవీ ఫస్ట్ లిరికల్ సాంగ్ లాంచ్ (ఫొటోలు)

+5

విశాఖలో ఘనంగా కృష్ణాష్టమి వేడుకలు (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ చిత్రం సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

రష్మిక అతిథిగా 'ఎపిక్' ట్రైలర్ లాంచ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు