Breaking News

వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని.. కన్న బిడ్డలను చంపేసింది

Published on Sat, 02/14/2026 - 21:15

బటిండా: తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నారని కన్న బిడ్డల్ని చంపేసింది ఓ కర్కశ తల్లి. ఈ ఘటన పంజాబ్‌లోని  బటిండాలో జరిగింది. జస్సీ కౌర్ అనే మహిళకు సుఖ్‌ప్రీత్ కౌర్ (8) కూతురు, ఫతేవీర్ (6) కుమారుడు ఉన్నారు. జస్సీ కౌర్‌కు వేరొక వ్యక్తితో వివాహేతర సంబంధం కారణంగా.. పిల్లలు అడ్డుగా ఉన్నారని భావించింది. దీంతో వారి అడ్డు తొలగించుకోవాలని ప్లాన్‌ చేసింది.

అక్రమ సంబంధం మత్తులో ఉన్న జస్సీ కౌర్ తన పిల్లలను హత్య చేయడానికి కుట్ర పన్నింది. రెండు వారాల క్రితం కుమార్తె సుఖ్‌ప్రీత్ కౌర్‌కు ఆహారంలో ఎలుకల మందు కలిపి తినిపించింది. దీంతో ఆ చిన్నారి.. తన తల్లి ఇచ్చిన ఆహారం తిని మృతిచెందింది. ఆ పాప అనారోగ్యం కారణంగానే చనిపోయిందని, చుట్టుపక్కల వారిని, బంధువుల్ని నమ్మించింది. ఆ తర్వాత రెండు వారాల తర్వాత ఆరేళ్ల కొడుకు ఫతేవీర్‌ కౌర్‌కు కూడా ఎలుకల మందు కలిపిన ఆహారం పెట్టింది.

శనివారం ఆ బాలుడు కూడా మరణించాడు. ఈ విషాదకర ఘటన రెండు వారాల వ్యవధిలో జరిగింది. 15 రోజుల క్రితం ఎనిమిదేళ్ల బాలిక సుఖ్‌ప్రీత్ కౌర్ అనుమానాస్పద స్థితిలో మరణించగా, శుక్రవారం రాత్రి ఆమె ఆరేళ్ల తమ్ముడు ఫతేవీర్ కూడా ప్రాణాలు కోల్పోయాడు. వరుస మరణాలతో అనుమానం వచ్చిన గ్రామస్థులు ఫూల్ పోలీస్ స్టేషన్‌ను ఆశ్రయించి, సమగ్ర విచారణ జరపాలని డిమాండ్ చేశారు. విచారణ చేపట్టిన పోలీసులు.. కన్నతల్లే హత్య చేసినట్లు తేల్చారు. నిందితురాలు జస్సీ కౌర్ తన నేరాన్ని అంగీకరించిందని పోలీస్ అధికారి మనోజ్ కుమార్ తెలిపారు.

"మొదట 8 ఏళ్ల సుఖ్‌ప్రీత్ కౌర్ మరణించింది. నిన్న 6 ఏళ్ల ఫతేవీర్ చనిపోయాడు. ఒక పథకం ప్రకారం జస్సీ కౌర్ తన పిల్లలిద్దరినీ చంపేసింది. ఇద్దరు పిల్లలకు ఎలుకల మందు ఇచ్చి చంపినట్లు ఆమె ఒప్పుకుందని పోలీస్ అధికారి మనోజ్‌ కుమార్ పేర్కొన్నారు. జస్సీ కౌర్‌కు సహకరించిన ఆమె సోదరి మోటో కౌర్‌తో పాటు, లాఖీ సింగ్ అనే మరో వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)