Breaking News

ఈమె తల్లేనా?: చికెన్ అడిగిన పిల్లలపై రొట్టెల కర్రతో దాడి.. కుమారుడు మృతి

Published on Mon, 09/29/2025 - 12:31

పాల్ఘర్: మహారాష్ట్రలోని పాల్ఘర్‌లో విషాదం చోటుచేసుకుంది. పిల్లలను కంటికి రెప్పలా కాపాడాల్సిన తల్లి అత్యంత కర్కశంగా వ్యవహరించి, కొడుకు ప్రాణాలు పోయేందుకు కారకురాలయ్యింది. తమకు చికెన్‌ డిష్‌ తినాలని అనిపిస్తున్నదని ఇద్దరు అన్నాచెల్లెళ్లు తల్లిని చెప్పారు. అయితే ఆమె అందుకు నిరాకరిస్తూ, రొట్టెల కర్రతో వారిని చితకబాదింది. ఈ ఘటనలో ఆమె కుమారుడు మృతిచెందగా, కుమార్తె తీవ్ర గాయాలతో ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. సమాచారం అందుకున్న పోలీసులు తల్లిని అరెస్టు చేసి, దర్యాప్తు ప్రారంభించారు.

పాల్ఘర్‌లో జరిగిన ఈ దారుణ ఘటనలో మృతిచెందిన బాలుడిని చిన్మయ్ ధుమ్డేగా పోలీసులు గుర్తించారు. తొలుత చిన్మయ్ తన తల్లి పల్లవి ధుమ్డే (40)ను చికెన్ డిష్ అడిగాడు. దీంతో ఆమె ఇప్పుడు కుదరదని చెబుతూ, రొట్టెల కర్రతో కుమారునిపై దాడి చేసింది. తర్వాత తన తన పదేళ్ల కుమార్తెను కూడా అదే రొట్టెల కర్రతో కొట్టింది. చిన్నారుల ఆర్తనాదాలు విన్న స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసు సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు.

నిందితురాలైన తల్లిని అదుపులోకి తీసుకున్నారు. జిల్లా పోలీసు సూపరింటెండెంట్ యతీష్ దేశ్ ముఖ్ తెలిపిన వివరాల ప్రకారం.. పల్లవి తన కుటుంబంతో కాశీపాడ ప్రాంతంలోని ఒక ఫ్లాట్‌లో  ఉంటోంది. ఆమె కొట్టిన దెబ్బలకు కుమారుడు చిన్మయ్ గణేష్ ధుమ్డే (7) మృతిచెందాడు. 10 ఏళ్ల కుమార్తె ఆస్పత్రిలో చికిత్స పొందుతోంది. పాల్ఘర్ పోలీసులు ఆ తల్లిపై హత్య కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)