Breaking News

కుమారునికి ఉరివేసి, తల్లి ఆత్మహత్య

Published on Sun, 07/14/2024 - 11:40

బనశంకరి: భర్త మరణించి పుట్టెడు దుఃఖంలో ఉన్న మహిళ జీవితంపై విరక్తి చెంది తీవ్ర నిర్ణయం తీసుకుంది. పేగు తెంచుకుని పుట్టిన కుమారున్ని హత్యచేసిన తరువాత ఆమె ఆత్మహత్య చేసుకుంది. మనసులను కలిచివేసే ఈ ఘోర దుర్ఘటన బెంగళూరులో యలహంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. వివరాలు.. యలహంక ఆర్‌ఎంజెడ్‌ అపార్టుమెంట్‌లో పులివర్తి శ్రీధర్‌ (47), రమ్యా (40), వారి కుమార్తె (20), కుమారుడు భార్గవ్‌ (13) నివాసం ఉంటున్నారు. 

వీరి స్వస్థలం తిరుపతి ప్రాంతమని తెలిసింది. శ్రీధర్‌ ఐటీ ఇంజినీరుగా పనిచేసేవారు. మూడు నెలల క్రితం పులివర్తి శ్రీధర్‌ క్యాన్సర్‌తో మరణించారు. అప్పటి నుంచి రమ్యా భర్తను తలచుకుంటూ మనో వ్యాకులతకు గురైంది. ఇటీవల నగరంలోనే పీజీ హాస్టల్లో ఉన్న కుమార్తెతో రమ్యా ఫోన్‌లో మాట్లాడి బాధపడింది. ఈ నేపథ్యంలో రమ్యా పోలీసులకు, డాక్టరు, కుమార్తెకు లేఖ రాసి, అపార్టుమెంటులో కుమారుడు భార్గవ్‌ను ఉరివేసి హత్యచేసిన తరువాత రమ్యా కూడా ఉరి బిగించుకుని ప్రాణాలు వదిలింది. సమాచారం అందిన వెంటనే యలహంక పోలీసులు చేరుకుని మృతదేహాలకు శవపరీక్ష నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేపట్టారు.

 

Videos

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

మున్సిపల్ ఎన్నికలపై జగన్ ఫోకస్.. రెండో జాబితాలో బీసీలకు పెద్దపీట..!

తిరుపతిలో దారుణం.. నామినేషన్ వేయడానికి వెళ్లిన మహిళ బట్టలు చింపి...

భారీ ర్యాలీతో వరుదు కళ్యాణి నామినేషన్

ఒక్కోడికి చెప్తున్నా.. పోలీసుల ఓవరాక్షన్..! ఇచ్చిపడేసిన నరేన్ రెడ్డి

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)