Breaking News

ఒకేసారి గర్భందాల్చిన అమ్మ, అమ్మమ్మ, అత్తమ్మ.. ఫొటోలు వైరల్‌!

Published on Thu, 03/23/2023 - 14:04

ఈ రోజుల్లో ఫొటోషూట్‌లు సర్వసాధారణమైపోయాయి. జీవితంలో ముఖ్యమైన క్షణాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా  మంచి మంచి లోకేషన్లకు వెళ్లి షూట్‌లు నిర్వహిస్తున్నారు. బర్త్‌డే, వెడ్డింగ్, పోస్ట్ వెడ్డింగ్, ప్రీ వెడ్డింగ్, ప్రెగ్నెన్సీ.. ఇలా చాలా సందర్బాల్లో వినూత్న రీతిలో ఫొటోలు దిగుతున్నారు. వాటిని సోషల్‌ మీడియాలో షేర్ చేసి మురిసిపోతున్నారు.

తాజాగా ఇలాంటి ఫొటోషూట్ ఒకటి సోషల్ మీడియాలో తెగ వైరల్‌ అయ్యింది. ఓ మహిళతో పాటు ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ ప్రెగ్నెన్సీతో ఉన్న ఫొటోలు నెటిజన్లను విపరీతంగా ఆకర్షించాయి. ఒకేసారి మూడు తరాలకు చెందిన మహిళలు గర్భం దాల్చడం అత్యంత అరుదు కావడంతో ఈ ఫొటోలు, వీడియోను చూసిన వారు తెగ కామెంట్లు చేశారు. ఇతరులకు కూడా షేర్‌ చేసి వాటిని వైరల్ చేశారు.

నిజంగా సాధ్యమేనా?
ఒకేసారి మూడు తరాలకు చెందిన మహిళలు గర్భం దాల్చడం నిజంగా సాధ్యమేనా? అంటే దాదాపు అసాధ్యమే. ఈ వీడియో కూడా నిజం కాదు లేండి. ఇందులో కన్పిస్తున్న యువతి మాత్రమే గర్భం దాల్చింది. ఆమె అమ్మ, అత్తమ్మ, అమ్మమ్మ దిండు ధరించి ఫొటోషూట్‌లో ప్రెగ్నెంట్‌లా కన్పించారు. 

ఎందుకిలా?
జిబిన్ అనే వ్యక్తి ఫొటోగ్రాఫర్. అతని భార్య చింజు ఇటీవలే ప్రెగ్నెంట్ అని తెలిసింది. దీంతో ఇరు కుటుంబాలు సంతోషంలో మునిగిపోయాయి. అయితే భార్య ప్రెగ్నెన్సీ ఫొటో షూట్‌ను భిన్నంగా ప్లాన్‌ చేయాలనుకున్నాడు జిబిన్. అందుకే ఇంట్లోని మహిళలంతా గర్భం దాల్చినట్లు ఫొటోలు తీద్దామని, ఇది ఎప్పటికీ గుర్తుండిపోతుందని భార్యకు చెప్పాడు. ఈ ఆలోచన నచ్చి ఆమె కూడా అందుకు ఒప్పుకుంది. దీంతో అందరూ కలిసి ఈ ఫొటోషూట్ నిర్వహించారు. దీనికి సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడంతో ఆనందపడ్డారు.

చదవండి: ఆరేళ్లుగా కాపురం.. ఇద్దరు పిల్లలు.. భార్య తన సొంత చెల్లి అని తెలిసి భర్త షాక్..!

Videos

కవిత కొత్త పార్టీ.. గంగుల సంచలన వ్యాఖ్యలు

Man Ki Baat: సంకల్పానికి, సాహసానికి ఆపరేషన్ సిందూర్ ప్రతీక: మోదీ

విక్రమ్ తో సినిమా కి కండిషన్స్ పెడుతున్న మీనాక్షి

Operation Sindoor: పారిపోండ్ర బాబు.. బతికుంటే మళ్లీ కలుద్దాం

హిమాచల్ ప్రదేశ్ లో భారీ వర్షాలు.. లోతట్టు ప్రాంతాలు జలమయం

తిరకాసు గోవా టూర్ ప్లాన్ ఫెయిల్

జగన్ అప్పుడే చెప్పాడు.. వీరమల్లు రిలీజ్ కోసం పవన్ కష్టాలు..

జగనన్నను మళ్లీ సీఎం చేస్తాం.. అన్న కోసం ఎన్ని కేసులకైనా సిద్ధం

PSLV-C61 ఫెయిల్యూర్ పై పరిశీలనకు కమిటీ

హిందూపురంలో బాలయ్య భారీ బిల్డప్.. జనాల్లోకి వెళితే సీన్ రివర్స్

Photos

+5

Miss World 2025 : టాప్‌ మోడల్‌ పోటీలో గెలిచిన సుందరీమణులు (ఫొటోలు)

+5

మతాలు వేరైనా పెళ్లి బంధంతో ఒక్కటైన యాంకర్ డాలీ, కరమ్ అబ్బాస్ (ఫోటోలు)

+5

కేన్స్‌లోని మధుర క్షణాలను పంచుకున్న జాన్వీ కపూర్‌ (ఫోటోలు)

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)