Breaking News

హత్య కేసులో ట్విస్ట్‌.. వాట్సాప్‌లో పర్సనల్‌ ఫోటోలు, వీడియోలు..

Published on Sun, 11/09/2025 - 10:51

చెన్నై: తమిళనాడులో దారుణ ఘటన చోటుచేసుకుంది. మరో మహిళతో ప్రేమలో పడ్డ ఓ తల్లి.. తన బిడ్డను అత్యంత అమానుషంగా హత మార్చింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం సృష్టించింది. ఇద్దరు మహిళల సంబంధం గురించి పోలీసుల విచారణలో సంచలన విషయాలు బయటకు వచ్చాయి.

ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.. తమిళనాడులోని కృష్ణగిరి జిల్లా కెలమంగళం సమీపంలోని చిన్నట్టి గ్రామానికి చెందిన సురేష్‌, వేదవతి(పేరు మార్చడం జరిగింది)కి ఆరు సంవత్సరాల క్రితం వివాహం జరిగింది. వీరికి ముగ్గురు సంతానం. ఇద్దరు కుమార్తెలు, ఐదు నెలల బాబు ఉన్నారు. అయితే, రెండు రోజుల క్రితం ఆ పసివాడు అనుమానాస్పద స్థితిలో చనిపోయాడు. తల్లి మాత్రం.. పాలు ఇస్తుండగా ఊపిరాడక పిల్లాడు చనిపోయాడని అందర్నీ నమ్మించింది. కుటుంబ సభ్యులు కూడా ఆమె మాటను నమ్మి.. బాబుది సహజ మరణమని నమ్మి అంత్యక్రియలు నిర్వహించారు.

ఫొటోలు, వీడియోలు.. 
ఇదిలా ఉండగా.. బాబు చనిపోయిన తర్వాత భార్య ప్రవర్తనలో మార్పును సురేష్‌ గమనించాడు. ఈ క్రమంలో ఆమె ఫోన్‌ చెక్‌ చేయగా, అందులో ఉన్న ఫొటోలు చూసి షాక్‌ అయ్యాడు. ఆమె మరో మహిళ అయిన సుమిత్రతో ప్రేమలో ఉందని, వీరిద్దరి మధ్య స్వలింగ సంబంధం కొనసాగుతోందని సురేష్‌ గుర్తించాడు. వారిద్దరికి సంబంధించిన వీడియోలు చూసి ఒక్కసారిగా షాకయ్యాడు. దీంతో, తన కొడుకు మృతిపై అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులను ఆశ్రయించాడు.

భర్త సురేష్‌ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు.. ఇద్దరినీ తమదైన శైలిలో విచారించారు. దీంతో​, ఇద్దరి మధ్య ఉన్న సంబంధమే ఈ హత్యకు కారణమని పోలీసులు గుర్తించారు. అయితే, అంతకుముందు సురేష్‌, తన భార్యకు మధ్య గొడవలు జరిగాయి. అనంతరం, ఆమె కొంతకాలం తన పుట్టింట్లో ఉంది. కుటుంబ పెద్దల పంచాయతీ తర్వాత తిరిగి భర్త ఇంటికి వచ్చింది. కానీ, రెండు రోజుల క్రితం భర్త, కుటుంబ సభ్యులు బయట ఉన్న సమయంలో భారతి తన పసివాడికి ఊపిరాడకుండా చేసి చంపినట్లు విచారణలో వెల్లడైంది. ఇది సుమిత్ర సూచన మేరకే జరిగిందని పోలీసులు నిర్ధారించారు. ఈ కేసులో ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది. 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)