Breaking News

దేశంలో అత్యంత ఖరీదైన మెట్రో.. ప్రయాణికులపై మరో వాత

Published on Sun, 08/17/2025 - 12:14

బెంగళూరు: దేశంలో అత్యంత ఖరీదైన మెట్రోగా బెంగళూరు మెట్రో(నమ్మ మెట్రో) పేరుగాంచిది. ఇప్పుడు ఈ మెట్రో మరోమారు వార్తల్లో నిలిచింది. ‍ప్రయాణికులకు అదనపు లగేజీ రుసుమును విధించగానే ప్రయాణికులు భగ్గుమంటున్నారు. కొందరు ఈ విషయంలో మెట్రోను సమర్థిస్తుండగా, మరికొందరు ఇది ప్రయాణికులకు ఇది ఎంతో భారమని వ్యాఖ్యానిస్తున్నారు.

భారీ పరిమాణంలో ఉన్న తన లగేజీకి అదనంగా ఛార్జ్ చేసిన బెంగళూరు మెట్రోపై ఒక ప్రయాణికుడు అసహనం వ్యక్తం చేశాడు.  ఆ ప్రయాణికుడు ‘ఎక్స్‌’లో చేసిన ఒక పోస్టులో ఇటువంటి రుసుము సమర్థనీయమా? అని అడగడం సోషల్‌ మీడియాలో విస్తృత చర్చకు దారితీసింది. అవినాష్ చంచల్  అనే ఈ ప్రయాణికుడు తన ‘ఎక్స్‌’ పోస్టులో ఇలా రాశాడు. “ఈ బ్యాగ్ కోసం బెంగళూరు మెట్రోలో రూ.30 అదనంగా చెల్లించాల్సి రావడం  ఆశ్చర్యంగా ఉంది. బెంగళూరు మెట్రో ఇప్పటికే దేశంలోనే అత్యంత ఖరీదైనది. ఇప్పుడు మరింత భారంగా మారనున్నది’ అని రాశారు.
 

ఈ పోస్ట్ పలువురిని ప్రశ్నింపజేసింది. కొందరు చంచల్‌కు మద్దతు పలుకగా, మరికొందరు పెద్ద బ్యాగులు మరింత స్థలాన్ని ఆక్రమిస్తాయని కనుక, వాటిపై ఛార్జ్ వేయాలని వాదించారు. మరొక యూజర్‌.. బ్యాగ్ స్కానర్‌లో సరిపోయే దానికంటే పెద్దదిగా ఉంటేనే అదనపు రుసుము చెల్లించాలని సూచించారు. తాను సూట్‌కేస్, బ్యాక్‌ప్యాక్‌ను అనేకసార్లు ఛార్జ్ చేయకుండానే తీసుకెళ్లానని, అవి పరిమిత బరువుతోనే ఉన్నాయన్నారు. లగేజీకి ప్రత్యేక నిల్వ స్థలం ఉంటే  రుసుము విధించినా  అర్ధవంతంగా ఉంటుందని మరికొందరు అంటున్నారు.

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)