Breaking News

గుండె ధైర్యం ఉంటేనే ఈ రోడ్డెక్కండి!

Published on Sat, 01/03/2026 - 11:02

నిన్న గుండెలు జారిపోయే జర్నీ గురించి చూశాం కదా? ఇది అంతకుమించింది. ఈ రోడ్డుపై ప్రయాణించాలంటే ఆ గుండె చాలా గట్టిదై ఉండాలి. ఎందుకంటే దీనిపై వెళ్తుంటే మండు వేసవిలోనూ వణుకు పుట్టడం ఖాయం. ఫొటోలు చూస్తే ఆ సంగతి అర్థమైపోతోంది కదూ? ఈ రోడ్డులో జరిగిన ప్రమాదాల్లో చాలామంది మృత్యువాతపడ్డారు. అందుకే దీనిని డెత్‌ రోడ్డు అని పిలుస్తారు. ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన ఈ రహదారి బొలీవియా రాజధాని లా పాజ్‌ నుంచి నార్త్‌ యుంగాస్‌ వరకు 64 కిలోమీటర్ల మేర ఉంటుంది. 1930లలో చాకో యుద్ధ సమయంలో పరాగ్వే యుద్ధ ఖైదీలు దీనిని నిర్మించారు. 

రోడ్డులో చాలా భాగం కొండ అంచునే సాగుతుంది. పచ్చని చెట్లు.. దగ్గరగా పలకరించే మేఘాలు.. అందమైన జలపాతాలతో జర్నీ ఎంత బాగుంటుందో.. ఇక్కడ పొంచి ఉన్న ప్రమాదాలు అంతే ఆందోళనకరంగా అనిపిస్తాయి. ఈ రోడ్డు చాలా ఇరుకుగా.. కొన్నిచోట్ల 3 మీటర్ల వెడల్పు లోపే ఉంటుంది. ఓ పక్కన ఏకంగా 600 మీటర్ల లోతైన లోయలు శీతాకాలంలో కూడా అరికాళ్లలో చెమటలు పట్టిస్తాయి. లోయలోకి పడిపోకుండా ఎలాంటి రక్షణ ఏర్పాట్లు ఉండవు. దీంతో ఏమాత్రం అజాగ్రత్తగా ఉన్నా అంతే సంగతి. వీటికి తోడు కొండచరియలు విరిగిపడే ప్రమాదమూ పొంచి ఉంటుంది. 1990వ దశకం మధ్యకాలం వరకు ఈ రోడ్డులో ఏటా వంద మంది వరకు మరణించేవారు. 

అనంతరం ఆ సంఖ్య 200 నుంచి 300కి పెరిగింది. 1983 జూలైలో ఓ బస్సు లోయలోకి పడిపోవడంతో వంద మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. 1998 తర్వాత దాదాపు 30 మంది సైక్లిస్టులు మృత్యువాతపడ్డారు. ఈ నేపథ్యంలో ఇక్కడ ప్రమాదాల నివారణకు ట్రాఫిక్‌ నిబంధన సవరించారు. బొలీవియాలో వాహనాలు రోడ్డుకు కుడివైపున నడుస్తాయి. కానీ ఈ రోడ్డులో వెళ్లేటప్పుడు డ్రైవర్లు లోయ అంచును స్పష్టంగా చూడటం కోసం ఎడమ వైపున ప్రయాణించాలని నిబంధన విధించారు. 2006లో సేఫ్టీ గ్రిల్స్, డ్రైనేజ్‌ సిస్టమ్‌తో కూడిన రెండు లైన్ల కొత్త రోడ్డు అందుబాటులోకి రావడంతో ఈ మృత్యురహదారి సాహస పర్యాటక ప్రాంతంగా మారింది. ముఖ్యంగా మౌంటెన్‌ బైకింగ్‌కు ప్రసిద్ధ గమ్యస్థానమైంది. 
 

Videos

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

నడిరోడ్డుపై రవి నాయుడు రౌడీయిజం..! YSRCP నేతలు నామినేషన్ వేయకుండా టీడీపీ గుండాల దాడి..!

తిరగబడ్డ కారులో నిటారుగా మందుబాటిళ్లు..! ప్లాన్ చేసే ముందు కొంచెం చూసుకోవాలి కదా!

అందరూ కలిసి డ్రామాలాడుతున్నారా... కళ్లముందు ఇంత జరుగుతుంటే నిద్రపోతున్నారా..?

అవినాష్ పై AK-47తో ఫైరింగ్ చేయిస్తావా..? ఏ ఒక్కడినీ వదిలిపెట్టాను..!

గొడవలకు గొడ్డళ్లు సప్లై చేస్తున్నాడు.. చంద్రబాబుపై జగన్ సీరియస్!

లోకేష్ కు బుర్ర పనిచేయడం లేదు..! మిథున్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు

Photos

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)