Breaking News

‘సైఫ్‌’పై దాడి చేసింది ఒక్కడు కాదా..? రిమాండ్‌ రిపోర్ట్‌లో కీలక అంశాలు

Published on Mon, 01/27/2025 - 08:17

ముంబయి:బాలీవుడ్‌ నటుడు సైఫ్‌అలీఖాన్‌పై దాడి కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. సైఫ్‌పై దాడి కేసులో అరెస్టయిన బంగ్లాదేశ్‌ జాతీయుడు షరిఫుల్‌ ఇస్లామ్‌ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు కీలక విషయాలు వెల్లడించారు. ఈ దాడిలో ఇస్లామ్‌ ఒక్కడే కాకుండా మరికొందరి హస్తం ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ఇదే విషయాన్ని ఇస్లామ్‌ రిమాండ్‌ రిపోర్టులో పోలీసులు పేర్కొన్నారు.

ఈ కేసులో జనవరి 19న ఇస్లామ్‌ను పోలీసులు ముంబయిలోని థానెలో అరెస్టు చేశారు. ఇస్లామ్‌కు కోర్టు జనవరి 29దాకా కస్టడీ విధించింది. తమ విచారణలో ఇస్లామ్‌ నోరు విప్పడం లేదని పోలీసులు చెబుతున్నారు. మరోవైపు ఈ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు.

దాడి జరిగిన రోజు సైఫ్‌ ఇంట్లో ఉన్న అందరు పనివాళ్లు వేసుకక్ను బట్టలను ఇవ్వాల్సిందిగా పోలీసులు కోరారు. కేవలం సైఫ్‌ రక్తమే వాటిపై ఉందా ఇంకెవరిదైనా ఉందా అనే విషయం తెలుసుకోవడానికి పోలీసులు పనివాళ్ల దుస్తులను కోరినట్లు తెలుస్తోంది.

ఇక ఇస్లామ్‌కు సిమ్‌కార్డు అందించిన జహంగీర్‌ షేక్‌ అనే వ్యక్తి కోసం ముంబయి పోలీసులు ఆదివారం(జనవరి26) కోల్‌కతా వెళ్లారు. బంగ్లాదేశ్‌ నుంచి భారత్‌లోకి అక్రమంగా ప్రవేశించిన తర్వాత ఇస్లామ్‌ కొన్ని రోజులపాటు కోల్‌కతాలో ఉన్నట్లు పోలీసులు కనిపెట్టారు.

కాగా, జనవరి 16వ తేదీ రాత్రి 2 గంటలకు  సైఫ్‌అలీఖాన్‌పై ముంబై బాంద్రాలోని అతడి ఇంట్లోనే దుండగుడు దాడి చేశాడు. ఈ దాడిలో సైఫ్‌కు ఆరు కత్తిపోటు గాయాలయ్యాయి. ఈ గాయాలకు చికిత్స తీసుకున్న సైఫ్‌ ఇప్పటికే ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. తనపై దాడికి ముందు పనిమనిషిపై  దాడి  చేసిన దుండగుడు తనను కోటి రూపాయలు ఇవ్వాల్సిందిగా డిమాండ్‌ చేసినట్లు సైఫ్‌ ఇప్పటికే పోలీసులకు తెలిపారు.      

Videos

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

ఆ యంగ్ హీరోతో మమితా వివాహం.. క్లారిటీ ఇచ్చిన హీరోయిన్

పవన్ పై రగిలిపోతున్న జనసేన కేడర్...!

మిథున్ రెడ్డిపై హత్యాయత్నం.. కత్తులు, రాళ్లు, కర్రలతో కాన్వాయ్ పై దాడి

రామచంద్రాపురంలో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన టీడీపీ సీనియర్ నేతలు

అట్లాంటిక్ సముద్రం అడుగున పెను విధ్వంసం! శాస్త్రవేత్తల షాకింగ్ హెచ్చరిక!

చరణ్ సరసన సారా..!

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

Photos

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)