Breaking News

27న కేరళకు నైరుతి

Published on Sun, 05/11/2025 - 02:54

న్యూఢిల్లీ: నైరుతి రుతుపవనాలు ఈసారి ముందుగానే పలకరించనున్నాయి. సాధారణంగానే జూన్‌ ఒకటో తేదీన నైరుతి కేరళలోకి ప్రవేశిస్తాయి. అంతకంటే ముందుగా మే 27వ తేదీనే కేరళను తాకే అవకాశాలున్నాయని భారత వాతావరణ విభాగం(ఐఎండీ) శనివారం తెలిపింది. అదే జరిగితే 2009 తర్వాత మొదటిసారిగా రుతు పవనాలు మేలోనే వచ్చినట్లవుతుందని పేర్కొంది. 2009లో చాలా ముందుగా అంటే మే 23వ తేదీనే భారత ప్రధాన భూభాగాన్ని తాకాయి. సాధారణంగా జూలై 8వ తేదీకల్లా దేశం మొత్తానికి రుతుపవ నాలు వ్యాప్తి చెందుతాయి.

తిరిగి సెప్టెంబరు 17వ తేదీన వాయువ్య భారతం నుంచి ఉపసంహరణ మొదలై అక్టోబర్‌ 15కల్లా ముగుస్తుంది. గతేడాది మే 30న, అంతకు ముందు 2023లో జూన్‌ 8న కేరళను రుతుపవనాలు తాకాయి. అయితే, రుతు పవనాలు ప్రవేశించడానికి, ఈ సీజన్‌లో దేశవ్యాప్తంగా నమోదయ్యే వర్షపాతానికి ఎటువంటి సంబంధం లేదని ఐఎండీ అధికారులు తెలిపారు.

రుతుపవనాలు కేరళలోకి సాధారణం కంటే ముందుగా గానీ లేక ఆలస్యంగా గానీ తాకాయంటే దేశవ్యాప్తంగా అవి విస్తరిస్తాయని చెప్పలేమని అన్నారు. స్థానిక, ప్రాంతీయ, ప్రపంచ వ్యాప్తంగా ఉండే అనేక పరిస్థితులపై రుతు పవనాల వైఖరి ఆధారపడి ఉంటుందని వివరించారు. 2025 రుతుపవన సీజన్‌లో మొత్తమ్మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఏప్రిల్‌లో ఐఎండీ అంచనా వేసింది. దేశంలో వ్యవసాయరంగానికి రుతుపవనాలే కీలకం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)