Breaking News

కామాంధుడి చెర నుంచి రక్షించిన కోతులు!!

Published on Mon, 09/23/2024 - 13:31

దేశంలో అఘాయిత్యాలకు అంతే లేకుండా పోతోంది. కఠిన చట్టాలు.. శిక్షలు అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి.  పసికందుల నుంచి పండు ముసలి దాకా.. హత్యాచారాలకు బలైపోవడం నిత్యకృత్యంగా మారిపోయింది. అయితే.. కోతుల గుంపు ఓ అఘాయిత్యాన్ని నిలువరించాయన్న వార్త ఇప్పుడు నెట్టింట ఆసక్తికర చర్చకు దారి తీసింది.  

ఉత్తర ప్రదేశ్‌ భాగ్‌పట్‌లో ఆసక్తికరమైన ఘటన  చేసుకుంది. ఆరేళ్ల చిన్నారిని ఓ మానవ మృగం చిదిమేందుకు ప్రయత్నించగా.. హఠాత్తుగా హీరో మాదిరి ఎంట్రీ ఇచ్చిన కోతుల గుంపు అతనిపై దాడి చేసి ఆ ఘోరాన్ని ఆపాయి!!.

బాలిక చెప్పిన వివరాల ప్రకారం.. దౌలా గ్రామంలో సెప్టెంబర్‌ 20వ తేదీన ఇంటి బయట ఆడుకుంటున్న బాలికను నిందితుడు బలవంతంగా ఎత్తుకెళ్లాడు. పాడుబడ్డ ఓ భవనంలోకి తీసుకెళ్లి బెదిరించి అఘాయిత్యానికి ప్రయత్నించబోయాడు.  అయితే ఎక్కడి నుంచి వచ్చిందో ఓ కోతుల గుంపు.. నిందితుడిని బెదరగొట్టి అక్కడి నుంచి తరిమి కొట్టాయి. అయితే ఈ క్రమంలో ఆ చిన్నారిని మాత్రం అవి గాయపర్చలేదు.

అక్కడి నుంచి పరిగెత్తి ఇంటికి  చేరుకున్న చిన్నారి.. జరిగిన ఘటనను.. కోతులు తననెలా రక్షించాయో తల్లిదండ్రులకు చెప్పింది. ఘటనపై పోక్సో కేసు నమోదు చేసిన పోలీసులు సీసీటీవీ ఫుటేజీ ద్వారా నిందితుడిని గుర్తించారు. పరారీలో ఉన్న అతన్ని పట్టుకునే ప్రయత్నాల్లో ఉన్నట్లు స్థానిక పోలీసులు వెల్లడించారు. మరోవైపు.. కోతుల గుంపు రాకపోయి ఉంటే తమ బిడ్డ పరిస్థితి ఏమైపోయేదో అని ఆమె తల్లిదండ్రులు చెబుతున్నారు.

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)