Breaking News

భర్త లోన్ చెల్లించలేదని.. భార్యపై వడ్డీ వ్యాపారి దారుణం..

Published on Thu, 07/27/2023 - 17:43

పుణె: మహారాష్ట్రలో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. ఓ వ్యక్తి లోన్ చెల్లించలేదని అతని భార్యను ఓ వడ్డీ వ్యాపారి అత్యాచారం చేశాడని పోలీసులు తెలిపారు. ఈ  దారుణ ఘటన ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగినట్లు వెల్లడించారు. నిందితున్ని అరెస్టు చేసినట్లు స్పష్టం చేసినట్లు పేర్కొన్నారు. 

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బాధితుడు వడ్డీ వ్యాపారి వద్ద కొంత మొత్తంలో డబ్బును లోన్‌ రూపంలో తీసుకున్నాడు. కానీ సకాలంలో లోన్‌ చెల్లించలేకపోయాడు. దీంతో వడ్డీ వ్యాపారి దారుణంగా ప్రవర్తించారు. బాధితున‍్ని కత్తితో బెదిరించి.. అతని భార్యను అత్యాచారం చేశాడు. ఈ దృశ్యాలను ఫోన్‌లో రికార్డ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేశాడు. ఈ ఘోరం బాధితుని కళ్లముందే జరిగిందని పోలీసులు తెలిపారు. 

ఈ కేసులో నిందితున్ని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇండియన్ పీనల్ కోడ్‌తో సహా.. సమాచార సాంకేతిక చట్టం కింద కూడా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.  

ఇదీ చదవండి: శుభకార్యాల్లో సినిమా పాటలు.. కాపీ రైట్ కిందకు వస్తుందా..? కేంద్రం ఏం చెప్పింది..?

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)