Breaking News

మనీలాండరింగ్‌ కేసు: జైలులో ఉ‍న్న జార్ఖండ్‌ మంత్రి రాజీనామా

Published on Tue, 06/11/2024 - 10:03

రాంచి: మనీలాండరింగ్‌ కేసులో జైలులో ఉన్న అలంగీర్ ఆలం మంత్రి పదవికి రాజీనామా చేశారు. అలంగీర్ ఆలం మంత్రి పదవికి, కాంగ్రెస్‌ పక్ష నేత పదవికి  రాజీనామా చేసినట్లు ఆయన కుమారుడు తన్వీర్‌ ఆలం వెల్లడించారు. జూన్‌ 8 (శనివారం) ఆయన రాజీనామా చేసి.. రిజైన్‌ లెటర్‌ను అదే రోజు సీఎం కార్యాలయానికి పంపించారు. అయితే ఆయన రాజీనామా లేఖ జార్ఖండ్‌ సీఎం చంపయ్‌ సోరెన్‌ ఆఫీసుకు సోమవారం చేరినట్లు తన్వీర్ తెలిపారు. 

అలంగీర్ ఆలం రాజీనామా చేసినట్లు జార్ఖండ్ కాంగ్రెస్‌ చీఫ్‌ రాజేశ్‌ ఠాకూర్‌ నిర్ధారించారు. మనీలాండరింగ్‌ కేసులో అలంగీర్‌ను దర్యాప్తు చేయటం కోసం  ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్‌ (ఈడీ) మే15న అరెస్ట్‌ చేసింది.  మే 6  అలంగీర్‌ ఆలం వ్యక్తిగత కార్యదర్శి సంజీవ్‌ లాల్ పని మనిషి జహంగీర్‌ ఆలం ఇంట్లో ఈడీ సోదాలు చేపట్టింది. ఈడీకి సుమారు రూ. 37 కోట్ల భారీ నగదు పట్టుబడిన విషయం తెలిసిందే. భారీగా నగదు పట్టుబడటం జార్ఖండ్‌లో సంచలనం రేపింది. అలంగీర్‌ ఆలంతోపాటు సంజీవ్‌ లాల్‌ను కూడా ఈడీ అరెస్ట్‌ చేసింది. 

జార్ఖండ్‌ రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌ మాజీ చీఫ్‌ ఇంజనీర్ వీరేంద్ర కె రామ్‌ మనీలాండరింగ్‌ కేసుతో సంబంధం ఉందన్న అనుమానంతో ఈడీ జహంగీర్ ఆలం ఇంటిపై సోదాలు చేసింది. వీరేంద్ర​  కె రామ్ గతేడాది అరెస్ట్‌ అయ్యారు. రూరల్‌ డెవలప్‌మెంట్‌ డిపార్టుమెంట్‌కు సంబంధించిన పలు స్కీముల్లో అక్రమాలకు పాల్పడినట్లు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి.

చదవండి: మంత్రి పీఎస్‌ పనిమనిషి  ఇంట్లో కోట్లు

Videos

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)