Breaking News

మనీలాండరింగ్‌ కేసు: ఆప్‌ ఎమ్మెల్యేకు 14 రోజుల జ్యుడీషియల్‌ కస్టడీ

Published on Mon, 09/09/2024 - 17:57

ఢిల్లీ: ఆప్‌ ఎమ్మెల్యే అమానతుల్లా ఖాన్‌కు ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు సెప్టెబర్‌ 23వరకు 14 రోజుల జ్యుడీషల్‌ కస్టడీ విధించింది. అమానతుల్లా ఖాన్‌ ఢిల్లీ వక్ఫ్‌బోర్డ్‌లో నియామకాలు, ఆ సంస్థకు చెందిన రూ.100 కోట్లు విలువ చేసే ఆస్తుల లీజుకు సంబంధించి అవకతవకలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎందుర్కొంటున్నారు. ఇక.. ఈ వ్యవహారానికి సంబంధించిన మనీలాండరింగ్‌ కేసులో ఆయన్ను ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) ఇటీవల అరెస్టు చేసిన విషయం తెలిసిందే. 

తాజాగా సోమవారం ఈడీ అమానతుల్లా ఖాన్‌ను రౌస్ అవెన్యూ కోర్టులో హాజరుపరించింది. అమానతుల్లా ఖాన్‌ని విడుదల చేస్తే ఈ కేసులో సాక్షులను ప్రభావితం చేసి అకాశం ఉందని ఈడీ కోర్టుకు తెలిపింది. దీంతో విచారణకు ఆటంకం కలుగుతుందని ఆయన్ను 14 రోజలు జ్యుడీషియల్‌ కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోర్టును కోరింది. ఈడీ అభ్యర్థను పరిగణలోకి తీసుకున్న కోర్టు ఆప్‌ ఎమ్మెల్యేకు సెప్టెంబర్‌ 23 వరకు జ్యుడీషియల్‌ కస్టడీ విధించింది.

సెప్టెంబర్‌ 2వ తేదీన ఉదయం నుంచే ఆప్‌ ఎమ్మెల్యే నివాసంపై ఈడీ సోదాలు చేపట్టింది. సుమారు ఆరు గంటలు సోదాలు చేసిన అనంతరం ఈడీ అధికారులు అమానతుల్లా ఖాన్‌ అరెస్ట్‌ చేశారు.

Videos

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

ఎన్నికలు సజావుగా జరిగితే విజయం మాదే..

దసరాకి RC ఫాన్స్ కు అదిరిపోయే న్యూస్..!

హైకోర్టులో YSRCP పిటిషన్.. పొన్నవోలు వాదనలు

అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో అయ్యన్నపాత్రుడికి షాక్

కడపలో ఉద్రిక్తత నామినేషన్ పత్రాలు చించివేత

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

Photos

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)