Breaking News

కుంభమేళా మోనాలిసా తొలి ప్రదర్శన.. ‘ఐ లవ్యూ’ అంటూ..

Published on Thu, 02/27/2025 - 09:18

యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో జరిగిన మహాకుంభమేళా(Mahakumbh Mela)లో పూసల దండలు అమ్ముకునేందుకు వచ్చిన మోనాలిసా రాత్రికి రాత్రే సోషల్ మీడియా స్టార్‌గా మారిపోయింది. దీంతో ఆమెకు అటు సినిమా అవకాశాలు, ఇటు ప్రకటనల్లో నటించే అవకాశాలు వస్తున్నాయి. తాజాగా ఆమె ఒక బహిరంగ వేదికపై జరిగిన ‍ప్రదర్శనలోనూ పాల్గొంది.

మహాశివరాత్రి సందర్భంగా నేపాల్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో మోనాలిసా భోంస్లే(Monalisa Bhosle) పాల్గొంది. ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. వేదికపై మోనాలిసా నృత్య ప్రదర్శన ఇచ్చారు. దీనికి సంబంధించిన వీడియోను ఆమె తన ఇన్‌స్టాగ్రామ్‌ ఎకౌంట్‌లో షేర్‌ చేశారు. ‘నేపాల్‌లోని మైలాపూర్‌లో మహాశివరాత్రి ఉత్సవాల్లో తన లైవ్‌ ప్రదర్శన’ అని మోనాలిసా భోంస్లే ఈ వీడియో కింద రాశారు.

ఈ వీడియో(Video)ను చూసిన యూజర్స్‌ తమ ‍ప్రదిస్పందనలను తెలియజేస్తున్నారు. ఒక యూజర్‌ ‘చాలా బాగుంది. దీనినే కంటిన్యూ చేయండి’ అని రాయగా మరొకరు ‘చాలా బాగుంది మోనాలిసా.. విజయం నిన్ను ముద్దాడుతుంది’ అని రాశారు. ఇంకొక  యూజర్‌ ‘అక్కకు ఇలాంటి సపోర్ట్‌ ఇవ్వాలి’ అని పేర్కొన్నారు. కాగా మోనాలిసా పాల్గొన్న ఈ కార్యక్రమంలో డైరెర్టర్‌ సనోజ్‌ మిశ్రా కూడా పాల్గొన్నారు. ఆయనే మోనాలిసాకు తొలి సినిమా అవకాశం ఇచ్చారు. ఈవెంట్‌ ప్రారంభానికి ముందు మోనాలిసా ‘అందరికీ ఐ లవ్యూ’ అంటూ తన నృత్యాన్ని ప్రదర్శించింది.

ఇది కూడా  చదవండి: Chandrashekhar Azad: ‘నా పేరు ఆజాద్‌.. స్వాతంత్ర్యం నా తండ్రి’

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)