వారెవ్వా! నటనలోనే కాదు, ఫార్మింగ్‌లోనూ సూపర్‌ స్టారే!

Published on Mon, 06/01/2026 - 17:23

నటులుగా వెండితెరపై మెరవడం మాత్రమే కాదు, సేంద్రియ వ్యవసాయం (ఆర్గానిక్ ఫార్మింగ్)తో ఆకట్టుకున్నారు. ఆరోగ్యంతోపాటు, పర్యావరణ పరిరక్షణకు తోడ్పడాలనే ఆలోచనతో చాలా మంది ప్రముఖులు సొంతంగా ఫామ్‌హౌస్‌లను ఏర్పాటు చేసుకుని ప్రకృతి వ్యవసాయం చేస్తున్నారు. అలాంటి వారిలో మలయాళ సూపర్ స్టార్ మోహన్‌లాల్‌ ఒకరు. నటన మాత్రమే కాదు., ఆర్గానిక్ ఫార్మింగ్‌లోనూ సూపర్‌స్టార్ అనిపించుకుంటున్న  మోహన్‌లాల్  పచ్చని స్వర్గం గురించి తెలుసుకుందాం.

భారతీయ సినిమా రంగంలో అత్యంత ప్రభావవంతమైన నటులలో ఒకరిగా ఉండటమే కాకుండా, మలయాళ చిత్ర పరిశ్రమ ఇప్పటివరకు చూసిన అత్యంత విజయవంతమైన సూపర్‌స్టార్లలో మోహన్‌లాల్ కూడా ఒకరు. అయితే, ఆయన ఆసక్తులు సినిమాకు మాత్రమే పరిమితం కాలేదు.సినిమాతో పాటు థియేటర్, సంగీతం, వ్యాపారం, మ్యాజిక్ వంటి పలు రంగాల్లో తన ప్రతిభను చాటుకున్న మోహన్‌లాల్, ఎర్నాకుళం జిల్లా కరూర్ పరిధిలోని ఎలమక్కరలో ఉన్న తన ఇంటి పక్కన గల అర ఎకరం భూమిలో ఆర్గానిక్ ఫార్మింగ్ (సేంద్రీయ వ్యవసాయం) చేస్తూ ఒక పచ్చని నందనవనాన్ని సృష్టించారు.

అయితే సేంద్రీయ వ్యవసాయం చేయాలనే ఆలోచన  కోవిడ్‌ లాక్‌డౌన్ సమయంలో హఠాత్తుగా ఏమీ ప్రారంభించలేదు. 2010ల మధ్యకాలం కాలంనుంచే ఆయన ఈ పనిలో ఉన్నారు.  అయితే, 2020-2021 కోవిడ్ లాక్‌డౌన్ల సమయంలో సినిమా షూటింగులు, ఇతర వినోద కార్యక్రమాలు పూర్తిగా నిలిచిపోవడంతో ఆయన తన పూర్తి సమయాన్ని ఈ వ్యవసాయంపైనే కేంద్రీకరించారు.

ఇదీ చదవండి: అసలే పక్షవాతం, ఆపై విషసర్పం వాటేసుకుంది..వీడియో చూస్తే వణుకే!

ఇక ఆయన తోటలో పండని  కూరగాయ లేదంటే అతిశయోక్తి లేదు. మోహన్‌లాల్ గతంలోనే ఒక వీడియోలో వెల్లడించినట్టు కాకరకాయ, బీన్స్, బెండకాయ, టమాటాలు, పచ్చిమిర్చి, బూడిద గుమ్మడికాయ, తీపి గుమ్మడికాయ, మొక్కజొన్న, కర్రపెండలం వంటి కూరగాయలు పండిస్తున్నారు.  తాను ఇంట్లో ఉన్నప్పుడల్లా ఇక్కడ పండిన సొంత కూరగాయలనే తింటానని ఆయన చెప్పారు. తన వ్యవసాయ క్షేత్రం ఫోటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో పంచుకుంటూ ఉంటారు కూడా. స్థలం లేని వారు గ్రో బ్యాగుల్లో (Grow bags) అయినా తమకు కావలసిన కూరగాయలను పండించుకోవచ్చని ఆయన అందరికీ పిలుపునిచ్చారు.  అన్నట్టు మోహన్‌లాల్‌కు పెంపుడు జంతువులన్నా కూడా చాలా ప్రేమ.మరోవైపు కెమికల్స్ లేని వ్యవసాయాన్ని ప్రోత్సహిస్తున్నందుకు అప్పటి కేరళ వ్యవసాయ శాఖ మంత్రి వి.ఎస్. సునీల్ కుమార్ కూడా మోహన్‌లాల్‌ను అభినందించారు.

 

ఇదీ చదవండి: 65 నిమిషాల్లో 10 వేల అడుగులు : పక్కా లెక్కలతో ఇలా!

'దృశ్యం 3'తో సరికొత్త బాక్సాఫీస్ రికార్డులు
దృశ్యం 3తో మలయాళ బాక్సాఫీస్ చరిత్రను తిరగరాసిన మోహన్‌లాల్ మోహన్‌ లాల్‌ కరియర్‌పరంగా ఆలోచిస్తే దాదాపు 45 ఏళ్లకు పైగా సినీ కెరీర్‌లో 360 కంటే ఎక్కువ సినిమాల్లో నటించి, రెండుసార్లు ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డులు ,ప్రతిష్టాత్మక  దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్నారు. ఇటీవలే డైరెక్టర్ జీతూ జోసెఫ్ కాంబినేషన్‌లో వచ్చిన 'దృశ్యం 3' (2026) మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. ఈ మూవీ మే 31, ఆదివారం నాటికి ప్రపంచవ్యాప్తంగా  రూ. 219.75 కోట్లు  కొల్లగొట్టినట్టు తెలుస్తోంది.

ఇదీ చదవండి: బీజేపీ ఎమ్మెల్యే పెళ్లి సందడి : ఎద్దుల బండి ఊరేగింపు

Videos

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)