Breaking News

ప్రియాంక హక్కును రాహుల్ లాక్కున్నారా?

Published on Sun, 05/05/2024 - 08:22

యూపీలోని రాయ్‌బరేలీ నుంచి ప్రియాంకా గాంధీ పోటీచేస్తారని భావిస్తున్న తరుణంలో అక్కడి నుంచి రాహుల్‌ ఎన్నికల బరిలోకి దిగుతున్నట్లు కాంగ్రెస్‌ ప్రకటించడం ఆసక్తికరంగా మారింది. ఇక్కడి నుంచి రాహుల్ గాంధీ నామినేషన్ కూడా దాఖలు చేశారు.

ఈ నేపధ్యంలో మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీపై  పలు ఆరోపణలు చేశారు. రాయ్‌బరేలీ నుంచి నామినేషన్ దాఖలు చేయడం ద్వారా రాహుల్ గాంధీ తన సోదరి ప్రియాంక గాంధీ వాద్రా, ఆమె భర్తకు గల హక్కులను లాక్కున్నారని ఆరోపించారు. గుణ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికల ప్రచారం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో సీఎం మోహన్ యాదవ్ ఈ  ఆరోపణలు చేశారు.

ఓటమి భయంతో రాహుల్ గాంధీ అమేథీ (ఉత్తరప్రదేశ్) నుంచి వయనాడ్ (కేరళ)కు పారిపోయారని కూడా మోహన్ యాదవ్  ఎద్దేవా చేశారు. ఇటీవల రాహుల్ గాంధీ బావ రాబర్ట్ వాద్రా ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో పోటీ చేయడానికి సిద్ధంగా ఉన్నారంటూ ఆ పార్టీ మద్దతుదారులు పోస్టర్లు అంటించారని యాదవ్ గుర్తు చేశారు. మొత్తంగా చూస్తే రాహుల్‌ గాంధీ అటు తన సోదరి ప్రియాంక, ఇటు బావ రాబర్ట్‌ వాద్రాల హక్కులను లాక్కున్నట్లయ్యిందని మోహన్‌ యాదవ్‌ పేర్కొన్నారు. 

Videos

రాయచోటిలో హైటెన్షన్.. YSRCP ఆఫీస్ కి వాహనాలకి నిప్పు

విశాఖ మేయర్ అభ్యర్థిగా వరుదు కళ్యాణి

రణబాలి సెన్సార్ రివ్యూ అవుట్.. సినిమా ఎలా ఉండనుందంటే..!

సుపారి ఇచ్చిన TDP నేతలు మిథున్ రెడ్డిపై మర్డర్ స్కెచ్ బట్టబయలు

దసరాకు విశ్వంభర సర్ ప్రైజ్ ...

EXCLUSIVE VISUALS: చేతికి గాయాలతో మిథున్ రెడ్డి

బంగారం కొనేవారికి గుడ్ న్యూస్! ఇవాళ తులం ఎంతంటే

మిథున్ రెడ్డిపై దాడి.. పెద్దిరెడ్డి స్టాంగ్ రియాక్షన్

దాడి తర్వాత గాయాలతో మిథున్ రెడ్డి

మిథున్ రెడ్డి కార్లన్నీ ధ్వంసం

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)