నేటి నుంచి ప్రధాని మోదీ గుజరాత్‌ పర్యటన.. షెడ్యూల్‌ ఇదే..

Published on Sat, 03/01/2025 - 07:36

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీ(Narendra Modi) ఈరోజు (శనివారం) నుంచి మూడు రోజుల పాటు గుజరాత్‌లో పర్యటించనున్నారు. జునాగఢ్ జిల్లాలోని ససాన్‌లో జరిగే జాతీయ వన్యప్రాణి బోర్డు (ఎన్‌బీడబ్ల్యుఎల్‌) సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించనున్నారు. జామ్‌నగర్‌లోని రిలయన్స్ ఫౌండేషన్ జంతు సంరక్షణ కేంద్రంను సందర్శించనున్నారు. అలాగే సోమనాథ్ ట్రస్ట్ సమావేశంలో కూడా పాల్గొననున్నారు.

ప్రధాని మోదీ తన పర్యటనలో ఆదివారం జామ్‌నగర్‌లోని వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారు.  అనంతరం జంగిల్ సఫారీ చేయనున్నారు. గుజరాత్ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ ఎపీ సింగ్ మాట్లాడుతూ మార్చి ఒకటిన సాయంత్రం ప్రధాని జామ్‌నగర్(Jamnagar) చేరుకుంటారని, రాత్రికి అక్కడి సర్క్యూట్ హౌస్‌లో బస చేస్తారని తెలిపారు. మరుసటి రోజు వంటారా జంతు సంరక్షణ కేంద్రాన్ని సందర్శిస్తారన్నారు. తరువాత జామ్‌నగర్ నుండి బయలుదేరి సాయంత్రం ససాన్ చేరుకుంటారు. అక్కడ ఆయన సోమనాథ్ ట్రస్ట్ సమావేశానికి అధ్యక్షత వహిస్తారు.

మార్చి 3న ప్రధాని మోదీ ఆసియా సింహాలకు నిలయమైన గిర్ జాతీయ ఉద్యానవనంలో జంగిల్ సఫారీని  ఎంజాయ్‌ చేయనున్నారు.  ఈ పర్యటనలో ప్రధాని మోదీ సోమనాథ్ ఆలయంలో  పూజలు చేయనున్నారు.  అలాగే అటవీ ఉద్యోగులతో మోదీ సంభాషించనున్నారు. అనంతరం సోమనాథ్ నుండి రాజ్‌కోట్ విమానాశ్రయానికి చేరుకుని ఢిల్లీకి బయలుదేరుతారని సింగ్‌ తెలిపారు. 

ఇది కూడా చదవండి: ఢిల్లీలో ఉదయాన్నే వర్షం.. వీడని చలిగాలులు

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)