Breaking News

12 కి.మీ. అండర్‌గ్రౌండ్‌ జర్నీ!

Published on Wed, 09/25/2024 - 12:45

వచ్చేనెలలో ముంబైలో పర్యటించనున్న ప్రధాని నరేంద్ర మోదీ అక్కడ పలు ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. దీనిలో ముంబైలోని మొదటి భూగర్భ మెట్రో త్రీ ప్రాజెక్ట్‌ ఒకటి. ఇది ఆక్వా లైన్‌లోని మొదటి దశ. ఆరే కాలనీ, బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బీకేసీ) మధ్య నడుస్తున్న 12 కిలోమీటర్ల మార్గానికి ఇది విస్తరణకానుంది.

మీడియాకు అందిన వివరాల ప్రకారం థానే క్రీక్ వంతెనలోని ఒక భాగం, ముంబై నుండి నాగ్‌పూర్‌కు అనుసంధానించే సమృద్ధి ఎక్స్‌ప్రెస్‌వే చివరి దశ ప్రాజెక్టులను కూడా ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. థానే రింగ్ మెట్రోకు కూడా ఆయన శంకుస్థాపన చేయనున్నారు. ముంబై మెట్రో కొత్త విస్తరణలో మొత్తం 10 స్టేషన్లు ఉండనున్నాయి. ఈ కారిడార్ పొడవు 33.5 కి.మీ. ఈ లైన్‌ పూర్తి కావడానికి 2025 మార్చి వరకూ సమయం పట్టనుంది.

ఈ మార్గంలో మెట్రో అందుబాటులోకి వచ్చాక దాదాపు 2,500 మంది ప్రయాణికులు ప్రయాణించవచ్చని అంచనా. దేశీయ, అంతర్జాతీయ విమానాశ్రయాలకు చేరుకునేందుకు ఈ మెట్రో ఎంతో ఉపయుక్తం కానుంది. ఈ ఆక్వా లైన్ దక్షిణ ముంబై, మధ్య పశ్చిమ ప్రాంతాలను కలుపుతుంది. ఈ మార్గంలో నారిమన్ పాయింట్, ముంబై సెంట్రల్, వర్లీ, దాదర్ నుంచి ముంబై అంతర్జాతీయ విమానాశ్రయానికి నేరుగా చేరుకోవచ్చు. 

ఇది కూడా చదవండి: త్వరలో తొలి ఎయిర్‌ ట్రైన్‌.. ప్రత్యేకతలివే

Videos

భువనగిరిలో ఉద్రిక్తత ఎమ్మెల్యే, సీఎం రేవంత్ ఫ్లెక్సీపై నల్ల రంగు

పుష్ప శ్రీవాణి పై అంత నీచంగా ప్రవర్తిస్తారా? పోలీసుల ఓవర్ యాక్షన్... వరుదు కళ్యాణి అరెస్ట్

సుప్రీం కోర్టు కీలక నిర్ణయం..CJP నిరసనకారుల FIRలు రద్దు

పవన్ కళ్యాణ్ బర్త్ డే ఫ్లెక్సీ..జనసేన,టీడీపీ మధ్య కొట్లా

అడ్డంగా పడుకుని నీ పబ్లిసిటీ స్టంట్లు.. చంద్రబాబును ఏకిపారేసిన జడ శ్రవణ్

ఒకే ఇంట్లో 23 మృతదేహాలు 1000కి చేరిన మృతులు

YS జగన్ కు ఘన స్వాగతం

AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం

ఆర్ట్ డైరెక్టర్ ఆనంద్ సాయి కుమారుడు అరెస్ట్

కొబ్బరికాయ కొట్టేస్తా. గుమ్మడికాయ కట్టేస్తా.. అప్పనంగా క్రెడిట్ నొక్కేస్తా...

Photos

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

అనిరుధ్ కన్సర్ట్ కోసం జోనితా గాంధీ రెడీ అయిందిలా (ఫొటోలు)

+5

కీర్తి సురేశ్ కలర్‌ఫుల్ ఓనం సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

యాపిల్ సీఈఓగా 15ఏళ్లు.. టిమ్ కుక్ అరుదైన (ఫోటోలు)

+5

పార్వతీపురం మన్యం జిల్లా...శిఖపరువులో జలసవ్వడి (ఫొటోలు)

+5

యుగానికొక్కడు.. మెస్సీ అరుదైన జ్ఞాపకాలు! (ఫొటోలు)

+5

‘ఐ యామ్‌ గేమ్‌’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా నాగ్‌ అశ్విన్‌ (ఫొటోలు)

+5

కొత్త సినిమా ‘వేట’ ప్రారంభోత్సవం (ఫొటోలు)