Breaking News

మహారాష్ట్రలో మరో మూక దాడి.. యువకుడు మృతి

Published on Thu, 06/27/2024 - 08:22

మహారాష్ట్రలోని పాల్ఘర్ జిల్లాలో దారుణం చోటుచేసుకుంది. దొంగ అనే అనుమానంతో 23 ఏళ్లు యువకుడిని సామూహికంగా కొట్టి చంపారు. ఈ ఉదంతం స్థానికంగా కలకలం రేపింది. రంగంలోకి దిగిన పోలీసులు కేసు దర్యాప్తును ముమ్మరం చేశారు.

వివరాల్లోకి వెళితే నలసోపారాలోని వెలై పాడా ప్రాంతంలో 10 మంది గుంపుగా చేరి విజయ్ అలియాస్ అభిషేక్ జోగిందర్ సోనీ బంధించారు. దొంగతనం చేయాలనే ఉద్దేశ్యంతో విజయ్ అక్కడ సంచరిస్తున్నాడని ఆరోపిస్తూ, కర్రలతో విజయ్‌పై నిర్దాక్షిణ్యంగా దాడి చేశారు. ఈ దాడిలో విజయ్‌ అక్కడికక్కడే మృతి చెందాడని పోలీసు అధికారి మీడియాకు తెలిపారు.

ఈ ఘటనకు సంబంధించి ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, విచారణ కొనసాగుతున్నదని పోలీసులు తెలిపారు. గతంలో కూడా పాల్ఘర్‌లో మూక హత్యల ఉదంతం వెలుగు చూసింది. నాటి ఘటనలో ఇద్దరు సాధువులు, ఒక డ్రైవర్‌ హతమయ్యారు. 2020, ఏప్రిల్ 16న పాల్ఘర్ జిల్లాలోని గడ్చించలేలో ఇద్దరు సాధువులను, వారి కారు డ్రైవర్‌ను దొంగలుగా అనుమానించిన స్థానికులు మూకుమ్మడిగా వారిపై దాడి చేసి హత్య చేశారు. ఈ కేసులో పోలీసులు 201 మందిని అరెస్టు చేశారు. 

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

గోల్డ్ డ్రెస్‌లో మెరిసిపోతున్న అమితాబ్ మనవరాలు (ఫోటోలు)

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)