Breaking News

అందమైన అమ్మాయిలు రైతు బిడ్డను పెళ్లిచేసుకోవడం లేదు: ఎమ్మెల్యే కామెంట్స్‌

Published on Wed, 10/02/2024 - 20:17

ముంబై: అందమైన అమ్మాయిలు ఎవరూ రైతు బిడ్డని పెళ్లి చేసుకునేందుకు ఇష్టపడరు అంటూ మహారాష్ట్ర ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. దీంతో, ఆయన వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళా నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.

మహారాష్ట్రకు చెందిన అజిల్‌ పవార్‌ వర్గానికి చెందిన ఎమ్మెల్యే దేవేంద్ర భుయార్‌ వార్తల్లో నిలిచారు. తాజాగా ఆయన తన నియోజకవర్గం వరుద్ తహసీల్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా రైతుల సమస్యలపై మాట్లాడారు. ఈ క్రమంలో భుయార్‌ మాట్లాడుతూ.. ఉద్యోగం ఉన్న అబ్బాయిలనే అందమైన అమ్మాయిలు ఎంచుకుంటారు. ఒక అమ్మాయి అందంగా ఉంటే రైతుల కొడుకులను ఇష్టపడదు. కొందరు అమ్మాయిలు మాత్రమే వ్యవసాయ కుటుంబంలోని అబ్బాయిని వివాహం చేసుకునేందుకు ముందుకు వస్తున్నారు అని కామెంట్స్‌ చేశారు.

ఈ క్రమంలో ఎమ్మెల్యే దేవేంద్ర వ్యాఖ్యలపై కాంగ్రెస్‌ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నాయకురాలు, మహారాష్ట్ర మాజీ మహిళా శిశు అభివృద్ధి మంత్రి యశోమతి ఠాకూర్ స్పందిస్తూ.. మహిళలను ఉద్దేశిస్తూ భుయార్ మాట్లాడిన భాష సరిగా లేదన్నారు. ఆయన ఉపయోగించిన పదజాలం మహిళలను కించపరిచేలా ఉంది అంటూ మండిపడ్డారు. ఇదే సమయంలో తమ ఎమ్మెల్యేలను అదుపులో ఉంచుకోవాలని ఎన్సీపీ చీఫ్ అజిత్ పవార్‌కు సూచించారు.

ఇది కూడా చదవండి: వరద నీటిలో పడిపోయిన ఆర్మీ హెలికాప్టర్‌.. ఆ తర్వాత ఏమైందంటే?

 

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)