Breaking News

'దొంగ 'అని పొరబడి అనాలోచితంగా చితకబాదేశారు..పాపం ఆ వ్యక్తి..

Published on Sat, 05/27/2023 - 14:06

మద్యం మత్తులో ఓ వ్యక్తి హౌసింగ్‌ బోర్డులోకి చొరబడ్డాడు. అంతే అతన్ని దొంగగా భావించి సదరు హౌసింగ్‌ బోర్డు వాచ్‌మెన్‌, కొందరూ వ్యక్తులు అతడిని దొంగ అనుకుని చితకబాదేశారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ఆ వ్యక్తిని ఆస్పత్రికి చేర్పించగా..చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ షాకింగ్‌ ఘటన ముంబైలో చోటు చేసుకుంది. 

వివరాల్లోకెళ్తే..ప్రవీణ్‌ అనే వ్యక్తి మద్యం సేవించి సమీపంలో కూల్చి వేసి ఉన్న హౌసింగ్‌ బోర్డులోకి ప్రవేశించాడు. అది గమనించిన వాచ్‌మెన్‌ అతన్ని అడ్డుకునే ప్రయత్నం చేశాడు. కంగారుపడ్డ ఆ వ్యక్తి గోడ ఎక్కి పారిపోతున్నాడు. ఆగమని చెప్పిన వినకుండా వెళ్లడంతో ..వాచ్‌మెన్‌ తోపాటు సదరు వ్యక్తులు ప్రవీణ్‌పై గట్టిగా కర్రలతో దాడి చేశారు. ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు.

సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు అతన్ని కస్తుర్బా ఆస్పత్రికి తరలించాగా..అక్కడే చికిత్స పొందుతూ చనిపోయాడు. అయితే అతడి ఒంటిపై ఎలాంటి గాయాలు లేవు. అతను దాడి చేయడం వల్ల మరణించాడా లేక మరేదైనా కారణం వల్ల చనిపోయాడన్నది తెలియాల్సి ఉంది. ఈ మేరకు పోలీసులు పోస్ట్‌మార్టం అనంతరం అతడిపై దాడి చేసిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయడం ప్రారంభిస్తామని వెల్లడించారు.

(చదవండి:  డిప్లొమా డిగ్రీ అందుకున్న శునకం: వీడియో వైరల్‌)


 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)