Breaking News

మరో వివాదంలో పూజా ఖేడ్కర్.. ట్రక్కు డ్రైవర్‌ను కిడ్నాప్‌ చేసి..

Published on Mon, 09/15/2025 - 07:50

పూణె: వివాదాస్పద ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేడ్కర్ మరో వివాదంలో చిక్కుకున్నారు.  ఛీటింగ్‌ వ్యవహారంలో సస్పెండ్‌ అయిన ఐఏఎస్ ప్రొబెషనర్ పూజా ఖేద్కర్ మరోమారు వార్తల్లో నిలిచారు.  ముంబైలోని ఐరోలిలో కిడ్నాప్‌ అయిన ఓ ట్రక్ డ్రైవర్ పూణేలోని చతుశృంగి ప్రాంతంలో గల పూజా ఖేడ్కర్ ఇంట్లో కనిపించడం సంచలనంగా మారింది.

సామాజిక కార్యకర్త విజయ్ కుంభార్ ట్వీట్‌తో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది.  వివాదాస్పదురాలిగా మారి, సస్పెండ్ అయిన ట్రైనీ ఐఏఎస్ అధికారిణి పూజా ఖేద్కర్ తల్లి సాగించిన మరో దారుణం వెలుగులోకి వచ్చింది. ఈ ఉదంతంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న  ఐరోలి ప్రాంతంలోని సిగ్నల్ వద్ద ఓ ట్రక్‌ డ్రైవర్‌ కిడ్నాప్ అయ్యాడు. బాధితుడు నవీ ముంబైకి చెందిన ప్రహ్లాద్ కుమార్ (22). ఆయన  తన మిక్సర్ ట్రక్కును తీసుకెళ్తూ ఒక కారును ఢీకొన్నాడు. దీంతో కారులో ఉన్న ఇద్దరు వ్యక్తులు అతనిని బలవంతంగా తమ కారులోకి ఎక్కించి కిడ్నాప్ చేశారు. ఈ నేపధ్యంలో ప్రహ్లాద్ కుమార్ కనిపించడం లేదంటూ సంబంధీకులు రబాలే పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
 

కేసు దర్యాప్తులో భాగంగా అసిస్టెంట్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ ఖరత్ ఆ కారును ట్రాక్ చేసే దిశగా పూణేకు వెళ్లారు. ఆ కారు వివాదాస్పద ఐఏఎస్ అధికారి పూజా ఖేడ్కర్ ఇంటి లొకేషన్‌లో కనిపించింది. దీంతో ఖరత్ బృందం కిడ్నాప్‌ అయిన డ్రైవర్‌ను రక్షించినట్లు విజయ్ కుంభార్ తన ట్వీట్‌లో వివరించారు. ఈ కేసు దర్యాప్తు లో పూజా ఖేడ్కర్ తల్లి పోలీసులతో దురుసుగా ప్రవర్తించిందని, కనీసం తలుపు కూడా చాలాసేపటి వరకూ తెరవలేదని సమాచారం.  పోలీసులు పూజా ఖేడ్కర్‌ తల్లి చేసిన కిడ్నాప్‌ వ్యవహహారంపై దర్యాప్తు చేపట్టారు.

Videos

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)