Breaking News

వెజ్‌ బిర్యానీ షాప్‌ ఫ్రీజర్‌లో డెడ్‌బాడీ, షాకైన ఓనర్‌

Published on Wed, 03/04/2026 - 16:26

ఉత్తరప్రదేశ్‌లోని లక్నోలో ఒక దిగ్భ్రాంతికరమైన సంఘటన వెలుగులోకి వచ్చింది, నాలుగు రోజులుగా మూసి ఉన్న వెజ్ బిర్యానీ దుకాణం ఫ్రీజర్‌లో 38 ఏళ్ల వ్యక్తి మృతదేహాన్ని గుర్తించడం స్థానికంగా కలకలం రేపింది.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, లక్నోలోని GCRG కళాశాల ఎదురుగా ఉన్న బిర్యానీ దుకాణ యజమాని అజయ్ పాల్ కొనుగోలు కోసం బైటికి వెళ్లాడు నాలుగు రోజుల తర్వాత  తిరిగి షాప్‌కు వచ్చి, డీప్ ఫ్రీజర్‌ను చెక్‌ తనిఖీ చేస్తుండగా లోపల డెడ్‌ బాడీని గుర్తించి ఒక్కసారిగా షాకయ్యాడు. వెంటనే అధికారులకు సమాచారం ఇచ్చాడు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలుసుai మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోస్ట్‌మార్టం మిత్తం తరలించారు.

మృతుడి జేబులో దొరికిన మొబైల్ ఫోన్ ,ఆధార్ కార్డు ఆధారంగా మృతుడిని బక్షి కా తలాబ్ (BKT)లోని కిషున్‌పూర్ గ్రామానికి చెందిన విజయ్ పాల్‌గా గుర్తించారు. ఈ  దుకాణం మూడు వైపులా టిన్ షీట్‌లతో నిర్మించిన తాత్కాలిక నిర్మాణం అని, సరైన గేట్ లేదని సీనియర్ పోలీసు అధికారులు తెలిపారు. మృతదేహం తీవ్ర గాయాలైన గుర్తులు లేవు. మరణానికి ఖచ్చితమైన కారణం ఇంకా స్పష్టంగా తెలియలేదని, కుటుంబ సభ్యులను ఆరాతీస్తున్నామని వెల్లడించారు.పోస్ట్‌మార్టం నివేదిక తర్వాత మరిన్ని వివరాలు తెలుస్తాయని  చెప్పారు.

ఇదీ చదవండి: లిఫ్ట్‌లో షాకింగ్‌ యాక్సిడెంట్‌.. ఈ జాగ్రత్తలు తెలుసుకోండి!

ప్రాథమిక దర్యాప్తులో అతని చెప్పుల్లో  ఒకటి  కళాశాలకు దగ్గరగా ఉన్న రోడ్డు మూలన, మరొకటి  మరొకటి దుకాణం లోపల గుర్తించడం పలు అనుమానాలకు తావిస్తోంది. సీసీటీవీ  ఫుటేజ్‌ ఆధారంగా  మృతుడు దుకాణంలోకి ఎలా, ఎప్పుడు ప్రవేశించాడు, చివరిగా ఎప్పుడు తెరిచారు అనే విషయాలను కూపీ లాగుతున్నారు.
ఇదీ చదవండి: సంగీత్‌ వేడుకలో చిన్నారి స్టెప్పులు వైరల్‌, 82 లక్షల మంది ఫిదా!

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)