Breaking News

‘యమున’లో విగతజీవిగా త్రిపుర యువతి.. కుటుంబ కలహాలే..?

Published on Mon, 07/14/2025 - 07:05

న్యూఢిల్లీ: ఆరు రోజుల క్రితం ఢిల్లీలో అదృశ్యమైన త్రిపురకు చెందిన యువతి స్నేహా దేబ్‌నాథ్‌(19) ఆత్మహత్య చేసుకున్నదని, ఆమె మృతదేహం యుమునా నదిలో కనిపించిందని పోలీసులు తెలిపారు. ఈమె ఢిల్లీ యూనివర్శిటీలో చదువుకుంటోంది. స్నేహా దేబ్‌నాథ్‌ మృతదేహాన్ని ఆమె కుటుంబ సభ్యులు నిర్ధారించారని పోలీసులు పేర్కొన్నారు.

స్నేహా దేబ్‌నాథ్‌  అదృశ్యమైన దరిమిలా త్రిపురలోని ఆమె కుటుంబ సభ్యులు  ఆమె కోసం తీవ్రంగా గాలించారు. జూలై 7న ఆమె ఉత్తర ఢిల్లీలోని సిగ్నేచర్ బ్రిడ్జికి క్యాబ్‌లో వెళ్లింది. స్నేహ తాను ఆత్మహత్య చేసుకోవాలని అనుకుంటున్నట్లు సూచించే నోట్‌ను స్వాధీనం చేసుకున్నామని పోలీసులు తెలిపారు.  చదువు విషయంలో ఆమె కలకతచెందడం లేదని, ఆమె  ఆందోళనకు కారణం కుటుంబ కలహాలై ఉండవచ్చని పోలీసు వర్గాలు తెలిపాయి. సిగ్నేచర్ బ్రిడ్జికి 10 కి.మీ దిగువన ఉన్న గీతా కాలనీలోని ఫ్లైఓవర్ సమీపంలోని యమునా నదిలో ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు.

స్నేహా దేబ్‌నాథ్‌ను ఈ స్థలంలో దింపినట్లు క్యాబ్ డ్రైవర్ పోలీసులకు తెలిపాడు. కాగా ఈ వంతెనపై నిలబడి ఉన్న ఒక అమ్మాయిని చూశామని కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపారని పోలీసులు పేర్కొన్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం (ఎన్‌డీఆర్‌ఎఫ్‌), పోలీసు విభాగాల సహాయంతో ఆమె కోసం గాలింపు చర్యలు సాగాయి. వారు ఉత్తర ఢిల్లీలోని నిగమ్ బోధ్ ఘాట్ నుండి ఉత్తరప్రదేశ్‌లోని నోయిడా వరకుగల అన్ని ప్రాంతాలను అణువణువునా జల్లెడ పట్టారు. జూలై 7 తెల్లవారుజామున స్నేహా తన సన్నిహితులకు ఈమెయిల్స్‌ పంపిందని పోలీసులు తెలిపారు. గత కొన్ని నెలలుగా ఆమె మానసికంగా బాధపడుతున్నట్లు స్నేహితులు పోలీసులకు తెలిపారు.

Videos

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)