Breaking News

12 ఏళ్లయినా వీడని ఆశ.. నవరాత్రుల్లో కొడుకు దొరుకుతాడని..

Published on Sun, 10/06/2024 - 13:35

వారణాసి: ఆశ అనేని మనిషిని ముందుకు నడిపిస్తుందని అంటారు. మహారాష్ట్రకు చెందిన ఒక జంట 12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని కోసం ఏళ్ల తరబడి ఆశగా అన్నిచోట్లా వెదుకుతోంది.

వివరాల్లోకి వెళితే మహారాష్ట్రలోని జల్గావ్‌కు చెందిన విక్రమ్ మేఘ్వానీ 12 ఏళ్ల క్రితం అదృశ్యమయ్యాడు. ఇప్పటికీ విక్రమ్ తల్లిదండ్రులు నాడు తప్పిపోయిన కొడుకు కోసం కాశీలోని దేవాలయాలలో వెదుకులాట సాగిస్తున్నారు. నవరాత్రులలో అమ్మవారు తప్పకుండా తమ వినతి వింటుందని, అందుకే కాశీలోని అమ్మవారి ఆలయాలలో తిరుగున్నామని వారు చెబుతున్నారు.

తప్పిపోయిన కొడుకు ఫోటోను పట్టుకుని తిరుగుతున్న రణోమల్ సమనోమల్ మేఘ్వానీ, ఆయన భార్య లక్ష్మీబాయి రణోమల్ మేఘ్వానీలను చూసిన వారంతా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ వృద్ధ దంపతులు కాశీలోని వివిధ ఆలయాల వెలుపల తమ కుమారుని ఫొటోను, వివరాలతో కూడిన పోస్టర్‌ను అతికిస్తున్నారు.  12 ఏళ్ల క్రితం అదృశ్యమైన తమ కుమారుని ఆచూకీ లభిస్తుందని విక్రమ్ తల్లి లక్ష్మీబాయి ఆశాభావం వ్యక్తం చేశారు.

2012, ఆగస్టు 29న తన కుమారుడు దుకాణం నుంచి ఇంటికి వస్తూ అదృశ్యమయ్యాడని  లక్ష్మీబాయి తెలిపారు. దీనిపై మహారాష్ట్ర పోలీసులకు కూడా ఫిర్యాదు చేశామన్నారు. అయినా ఇప్పటి వరకు తమ కుమారుని ఆచూకీ లభించలేదన్నారు. ఈ వృద్ధ దంపతులు  నవరాత్రులలో కాశీలో ఉంటూ, తప్పిపోయిన తమ కుమారుని కోసం వెదుకుతున్నారు.

ఇది కూడా చదవండి: 16 ఏళ్లుగా మహిళ బందీ.. ఎముకల గూడు చూసి పోలీసులు షాక్‌

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)