Breaking News

వైద్యురాలి ఉదంతం మరవకముందే.. బెంగాల్‌లో మరో దారుణం

Published on Sat, 10/05/2024 - 14:06

కోల్‌కతా: కోల్‌కతా ఆసుపత్రిలో వైద్యురాలిపై హత్యాచార ఘటనకు మరువకముందే బెంగాల్‌లో మరో దారుణం వెలుగుచూసింది. వైద్యురాలి ఘటనపై సీఎం మమతా బెనర్జీ. బెంగాల్‌  ప్రభుత్వంపై ఇప్పటికీ విమర్శలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో.. కోచింగ్‌ క్లాస్‌కు వెళ్లిన 11 ఏళ్ల బాలిక అనుమానాస్పద స్థితిలో  మృతిచెందడం కలకలం రేపుతోంది.

బాలికను కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉంటారని అనుమానాలు రావడంతో  స్థానికుల నుంచి ఆగ్రహ జ్వాలలు వెల్లువెత్తాయి. ఘటనకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టారు. పశ్చిమ బెంగాల్‌లోని 24 పరగణాస్‌ జిల్లాలో ఈ ఘోరం చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. 11 ఏళ్ల బాలిక కోచింగ్‌ క్లాస్‌కు హాజరయ్యేందుకు శుక్రవారం ఇంటి నుంచి వెళ్లింది. రాత్రి అయినా తిరిగి రాకపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. 

బాలిక కోసం గాలిస్తున్న క్రమంలో శనివారం తెల్లవారుజామున 3.30 గంటల సంమయంలో ఓ పొలంలో ఆమె మృతదేహం లభ్యమైంది. ఒంటినిండా గాయాలు ఉండటంతో కిడ్నాప్‌ చేసి హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానం వ్యక్తంచేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించారు. వాటి ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని పోలీసులు పేర్కొన్నారు. 

అయితే ఈ దారుణానికి ఒడిగట్టినట్లు అనుమానిస్తున్న మోస్తకిన్ సర్దార్ అనే 19 ఏళ్ల యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటనతో ఆగ్రహించిన గ్రామస్థులు తీవ్ర నిరసన వ్యక్తంచేశారు. నిందితుడిపైవ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. కర్రలతో పోలీసుస్టేషన్‌పై దాడి చేసి, అవుట్‌ పోస్ట్‌కు నిప్పుపెట్టారు. దీంతో పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు భద్రతా బృందాలను మోహరించారు.

కాగా బాలికను అత్యాచారం చేసి చంపేసి ఉంటారని బీజేపీ ఆరోపిస్తోంది. ఇన్ని అఘాయిత్యాలు జరుగుతున్నా బెంగాల్‌ ప్రభుత్వం నిందితులపై కఠిన చర్యలు తీసుకోకపోవడం వల్లే మరో అమాయక బాలిక ప్రాణాలు కోల్పోయిందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సుకాంత మజుందార్  మండిపడ్డారు. ముఖ్యమంత్రి మమతాబెనర్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)