వీడియో: కర్ణాటకలో​ దారుణం.. పెళ్లి పేరుతో మైనర్‌ను బలవంతంగా లాక్కెళ్లి..

Published on Fri, 03/07/2025 - 08:11

బెంగళూరు: మన దేశంలో బాల్య వివాహాలపై ఎన్ని చట్టాల తెస్తున్నా ఎక్కడో ఒక చోట మైనర్లకు బలవంతపు పెళ్లిళ్లు చేస్తూనే ఉన్నారు. మైనర్లకు ఇష్టం లేని పెళ్లిళ్లు చేసి వారి జీవితాలను నాశనం చేస్తున్నారు. తాజాగా ఇలాంటి ఘటనే కర్ణాటకలో చోటుచేసుకుంది. ఓ 14 ఏళ్ల బాలికకు పెళ్లి చేసి, ఆమెను బలవంతంగా కాపురానికి పంపే ప్రయత్నంలో ఒక పశువును లాక్కెళ్లినట్లు లాక్కెళ్లారు. భార్యను ఆమెను ఎత్తుకుని పరుగు తీశాడు. దీంతో, అక్కడున్న వారు.. ఆమెను కిడ్నాప్‌ చేశారని అనుకున్నారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

వివరాల ప్రకారం..తమిళనాడులోని హోసూర్ సమీపంలోని తొట్టమంజు పర్వత ప్రాంతంలోని తిమ్మత్తూర్ అనే చిన్న గ్రామానికి చెందిన 14 ఏళ్ల బాలిక.. స్థానిక పాఠశాలలో ఏడో తరగతి వరకు చదివి, ఆ తర్వాతి ఇంటి వద్దే ఉంటోంది. ఈ క్రమంలో ఆమెకు పెళ్లి చేయాలని కుటుంబ సభ్యులు భావించి.. కర్ణాటకలోని కాలికుట్టై పర్వత గ్రామానికి చెందిన మాదేష్‌(29)తో వివాహం జరిపించారు. తనకు ఈ పెళ్లి ఇష్టం లేదని ఎంత చెప్పినా తల్లిదండ్రులు పట్టించుకోలేదు. ఇక, ఇటీవలే వీరి వివాహం బెంగళూరులో జరిగింది. అనంతరం, సదరు బాలిక తన స్వగ్రామానికి వచ్చేసింది. ఈ క్రమంలో అత్తారింటికి వెళ్లేందుకు నిరాకరించింది.

అయితే, పెళ్లి తర్వాత అత్తారింటికి వెళ్లాలని పేరెంట్స్‌.. ఆమెకు సర్ది చెప్పే ప్రయత్నం చేశారు. అయినా ఆమె వినలేదు. దీంతో, భర్త మాదేష్‌, అతడి కుటుంబ సభ్యులు బాలిక ఇంటి వచ్చారు. బలవంతంగా ఆమెను తమ ఇంటికి తీసుకెళ్లారు. ఓ గొర్రె పిల్లను బలవంతంగా బలికి తీసుకెళ్లినట్లు ఎత్తుకెళ్లిపోయారు. ఈ సందర్భంగా ఆమె కేకలు వేస్తూ కన్నీరు పెట్టుకుంది. ఈ దృశ్యాలను కొందరు వీడియోలు తీసి సోషల్‌ మీడియాలో షేర్‌ చేశారు. మరికొందరు ఆమెకు కిడ్నాప్‌ చేస్తున్నారని అనుకున్నారు. ఈ వీడియో పోలీసులకు చేరడంతో వారిపై పోక్సో చట్టం, బాల్య వివాహ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఇక, బాధితురాలు ప్రస్తుతం తన అమ్మమ్మ ఇంట్లో ఉంటోంది.

Videos

తొలిరోజే 100 కోట్లు... భారీ కలెక్షన్స్ దిశగా జైలర్ 2

కాలువలో పడ్డ బస్సు.. 8 మంది దుర్మరణం

పులివెందులలో TDP నేతల దాడి.. వైఎస్ అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

మీకు నిజంగా దైర్యం ఉంటే.. మిథున్ రెడ్డిపై దాడి CPI నారాయణ అదిరిపోయే కౌంటర్

వరుదు కళ్యాణి నామినేషన్.. వైజాగ్ మేయర్ గా నేనే గెలుస్తా..

నామినేషన్లకు హెల్మెంట్ పెట్టుకొని... చంద్రబాబు, లోకేష్ గూండాగిరి పై మధుసూదన్ రెడ్డి ఫైర్

CBI కి సాయి కృష్ణ కేసు.. వైఎస్ జగన్ హర్షం

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

Photos

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)