Breaking News

తిరుమలలో వరుస ఘటనలు: కేంద్ర హోంశాఖ సీరియస్‌

Published on Sat, 01/18/2025 - 19:22

తిరుపతి: తిరుమలలో ఇటీవల కాలంలో వరుసగా చోటు చేసుకున్న సంఘటనలపై కేంద్ర హోంశాఖ(Ministry of Home Affairs)  సీరియస్‌గా ఉంది. దీనిలో భాగంగా కేంద్ర హోంశాఖ అదనపు  కార్యదర్శి సంజీవ్‌  కుమార్‌  జిందాల్‌ తిరుమలలో పర్యటించనున్నారు.  ఇప్పటికే ఈనెల 8 వ తేదీన తిరుమలలో జరిగిన తొక్కిసలాట, 13వ తేదీన లడ్డూ కౌంటర్‌ వద్ద జరిగిన అగ్ని ప్రమాద ఘటనలపై ఇప్పటికే కేంద్రం నివేదిక కోరింది. ఈ నేపథ్యంలో కేంద్రం హోంశాఖ అదనపు కార్శిదర్శి సంజీవ్‌ కుమార్‌ తిరుమలలో పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రధానంగా   తిరుమల తొక్కిసలాట ఘటన(Tirupati Stampede Incident)పై సోమవారం సమీక్షనిర్వహించనున్నట్లు తెలుస్తోంది. అలాగే టీటీడీ అధికారులతో  హోంశాఖ అదనపు కార్యదర్శి సంజీవ్‌  కుమార్‌ జిందాల్‌ భేటీ కానున్నారు.  

వరుసగా తిరుమలలో చోటు చేసుకున్న ఘటనలపై టీటీడీ అధికారుల నుంచి నివేదిక కోరే అవకాశం ఉంది.  తిరుమలలో వరుసగా  చోటు  చేసుకుంటున్న పరిణామాలు చర్చనీయాంశంగా మారిన నేపథ్యంలో కేంద్ర  హోంశాఖ అదనపు కార్యదర్శి పర్యటనపై ఆసక్తి నెలకొంది.

పాలకుల వైఫల్యం.. భక్తులకు శాపం
ఇటీవల వైకుంఠ ఏకాదశి సందర్భంగా  టీటీడీ(TTD) పాలకుల మితిమీ­రిన ప్రచారం, అవగాహన రాహిత్యం, భద్రత ఏర్పా­ట్ల వైఫల్యం భక్తులకు శాపంగా మారింది. వైకుంఠ ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని పది రోజుల పాటు ఉత్తర ద్వార దర్శనం కల్పించనున్నట్లు టీటీడీ ప్రకటించింది. ఇందుకోసం తిరుపతి కేంద్రంగా భక్తులకు టోకెన్లను జారీ చేయాలని నిర్ణయించింది. ఈ క్రమంలో టీటీడీ చైర్మన్, అధికారులు నెల రోజుల నుంచి సమావేశాలు, సమీక్షలు నిర్వహించారు.

తరచూ కౌంటర్ల ఏర్పాట్లను పరిశీలిస్తూ, సామాన్య భక్తులకు దర్శనం కల్పించడమే ముఖ్య ఉద్దేశమంటూ ఊదరగొట్టారు. అతి ప్రచారం కారణంగా వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది భక్తులు తిరుపతికి పోటెత్తారు. భక్తుల రద్దీని అంచనా వేయడంలో టీటీడీ పూర్తిగా విఫలమైంది. ఆ స్థాయిలో ఏర్పాట్లు లేకపోవడంతో కౌంటర్ల వద్ద తీవ్ర గందరగోళం నెలకొంది. గురువారం ఉదయం 5 గంటల నుంచి మూడు రోజులకు సంబంధించి 1.20 లక్షల టోకెన్లను జారీ చేస్తామని  ముందుగానే ప్రకటించడంతో సుమారు నాలుగు లక్షల మందికి పైగా భక్తులు తిరుపతి చేరుకున్నారు.

బుధవారం తెల్లవారుజాము 5 గంటల నుంచే కౌంటర్ల వద్ద బారులు తీరారు. సాయంత్రానికి మరింత మంది తోడవ్వడంతో క్యూలైన్ల వద్ద రద్దీ పోటెత్తింది. సరిగ్గా ఇదే సమయంలో అధికారులు అనాలోచిత నిర్ణయంతో బుధవారం రాత్రి 8 గంటల నుంచే టోకెన్ల జారీ ప్రారంభించారు. దీంతో వేలాదిగా భక్తులు కౌంటర్ల వద్దకు పరుగులు పెట్టడం.. తోపులాట చోటుచేసుకోవడం.. ఆరుగురు మృతి చెందడం.. పదుల సంఖ్యలో భక్తులు గాయపడటం తెలిసిందే. 

తిరుమల లడ్డూ కౌంటర్ల వద్ద అగ్నిప్రమాదం
 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)