Breaking News

అర్ధరాత్రిళ్లు మేసేజ్‌లు.. అశ్లీలతే అవుతుంది!

Published on Fri, 02/21/2025 - 17:05

పరిచయం లేని మహిళలకు అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపడం.. అశ్లీలత కిందకే వస్తుందని ముంబై సెషన్స్‌ కోర్టు తీర్పు ఇచ్చింది. ఈ క్రమంలో ఓ మాజీ కార్పొరేటర్‌కు అశ్లీల సందేశాలు పంపాడనే కేసులో ఓ వ్యక్తికి కింది కోర్టు విధించిన శిక్షను సమర్థించింది.

‘‘మీరంటే ఇష్టం, మీరు చూడడానికి బాగున్నారు, అందంగా ఉన్నారు, మీకు వివాహం అయ్యిందా? లేదా?, మీరు సన్నగా ఉన్నారు!!..’’ అంటూ.. తెలియని మహిళలకు అర్ధరాత్రిళ్లు సందేశాలు పంపడం సరికాదు. ఈ చర్య అశ్లీలత(Obscene) కిందకే వస్తుంది. సమాజంలో పేరు ప్రఖ్యాతలు ఉన్నవాళ్లు, వాళ్ల భాగస్వాములు ఇలాంటి వాటిని తట్టుకోలేరు. ప్రత్యేకించి.. ఒకరికొరు పరిచయం లేని సమయంలో అస్సలు భరించలేరు’’ అని అడిషనల్‌ సెషన్స్‌ జడ్జి డీజీ ధోబ్లే వ్యాఖ్యానించారు.

అయితే రాజకీయ వైరంతోనే ఆమె తనపై తప్పుడు కేసు పెట్టిందని ఆ వ్యక్తి వాదించగా.. కోర్టు ఆ వాదనను తోసిపుచ్చింది. ఏ మహిళ తెలిసి తెలిసి తప్పుడు కేసుతో తన పరువును పణంగా పెట్టాలనుకోదని వ్యాఖ్యానించింది. ఈ కేసులో నిందితుడు బాధిత మహిళకు వాట్సాప్‌ ద్వారా అసభ్యకరమైన సందేశాలు పంపినట్లు ప్రాసిక్యూషన్‌ రుజువు చేసిందని, కాబట్టి నిందితుడు ట్రయల్‌ కోర్టు విధించిన శిక్షకు అర్హుడు అని సెషన్స్‌ కోర్టు స్పష్టం చేసింది.

ముంబై బోరివాలీ ఏరియాకు చెందిన మాజీ కార్పొరేటర్‌కు.. 2016 జనవరిలో నార్సింగ్‌ గుడే అనే వ్యక్తి వాట్సాప్‌ సందేశాలు పంపాడు. ‘‘మీరు చూడడానికి బాగుంటారు.. మీరంటే ఇష్టం. మీకు పెళ్లైందా?’’ అంటూ అర్ధరాత్రిళ్లు మెసేజ్‌లు పంపాడు. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదుచేయడంతో కేసు నమోదు చేసుకుని నార్సింగ్‌ను అరెస్ట్‌ చేశారు  ఆరేళ్ల తర్వాత.. మేజిస్ట్రేట్‌ కోర్టు నార్సింగ్‌ను దోషిగా నిర్ధారించి.. మూడు నెలల శిక్షను విధించింది.  అయితే ఈ శిక్షను అతను సవాల్‌ చేయగా.. తాజాగా ట్రయల్‌ కోర్టు తీర్పును సెషన్స్‌ కోర్టు సమర్థించింది. 

Videos

విశ్వక్ సేన్ లో ఇంత మార్పా?

CBI ఎంట్రీ ... సాయి కృష్ణ కేసులో కీలక పరిణామం

3 రోజులుగా నిర్బంధం.. పోలీసులకు విడదల రజిని వార్నింగ్

ఏపీ హైకోర్టులో YSRCP లంచ్ మోషన్ పిటిషన్

డెలివరీ బాయ్ సాహసం.. వంటింట్లో తప్పిన పెను ప్రమాదం..!

12th ఫ్లోర్ కిటికీలో వేలాడుతున్న చిన్నారి.. అసలు ఎం జరిగింది?

రెండింతల కసితో.. బాబుకు బడితపూజే

YSRCP అభ్యర్థులను దారుణంగా కొట్టిన TDP రౌడీలు

సండే ఎమ్మెల్యే కాదు.. సత్తా ఉన్న ఎమ్మెల్యేని.. ఇచ్చిపడేసిన శిల్పా రవి

The Paradise OTT: ఓటీటీలోకి వచ్చేసిన నాని 'ది ప్యారడైజ్'

Photos

+5

ఆస్ట్రేలియాలో ఎంజాయ్ చేస్తున్న కాయదు లోహర్ (ఫొటోలు)

+5

'ఇడుపు కాయితం' గడప సాంగ్.. మూవీ రిలీజ్ ఎప్పుడంటే?(ఫొటోలు)

+5

పెళ్లి బంధానికి నాలుగేళ్లు.. పూర్ణ ఫ్యామిలీ (ఫొటోలు)

+5

'మా అన్నయ్య బంగారం'.. ప్రభాస్ బర్త్ డే క్యూట్ ఫొటోస్

+5

'మిస్టర్ దెయ్యం' సినిమా లాంచ్ (ఫొటోలు)

+5

వైట్ శారీలో టాలీవుడ్ అందాల భామ ఈషా రెబ్బా కొత్త ఫోటోలు

+5

‘అక్క’ ట్రైలర్‌ లాంచ్‌లో మెరిసిన హీరోయిన్‌ కీర్తి సురేశ్‌ (ఫొటోలు)

+5

గజరాజులు తిరుగు ప్రయాణం... నగరవాసుల భావోద్వేగం

+5

'ఐఫా'అవార్డుల విలేకరుల సమావేశంలో బాలీవుడ్ నటులు సందడి (ఫొటోలు)

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా సద్దుల బతుకమ్మ (ఫొటోలు)