Breaking News

యువతిని వేధించి.. ఆపై పోలీస్‌ స్టేషన్‌లో.. ‘ట్రై చేస్తే ఆస్కార్‌ అవార్డ్‌ పక్కా’

Published on Mon, 04/14/2025 - 21:37

లక్నో: యువతి,యువకుడిపై అల్లరి మూకలు తెగబడ్డారు. బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేసి స్టేషన్‌కు తరలించారు. ఆ క్రమంలో నిందితులు తాము అనారోగ్యంతో ఉన్నామంటూ పోలీసులకు కలరింగ్‌ ఇచ్చే ప్రయత్నం చేశారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తున్న వీడియోలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. ఆ వీడియోలపై నెటిజన్లు తమదైన శైలిలో స్పందిస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్‌ అవార్డ్‌ వస్తుందంటూ కామెంట్లు చేస్తున్నారు. ఇంతకి ఈ ఘటన ఎక్కడ జరిగింది?

ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్ నగర్ జిల్లాలో అల్లరి మూకలు వీరంగం సృష్టించారు. ఓ యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఆమె స్నేహితుడిపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ దాడి అనంతరం బాధిత యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదుతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు నిందితుల్ని అరెస్ట్‌ చేశారు. పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.

అదిగో అప్పుడే నిందితులు తమలోని నటులను బయటపెట్టారు. ఫిర్యాదు దారులే తమపై దాడి చేశారంటూ పోలీసుల వద్ద మొరపెట్టుకున్నారు. బలహీన స్థితిలో ఉన్నామంటూ నటించేందుకు ప్రయత్నించారు. కాలుతో కుంటుకుంటూ నడుస్తూ, యాక్టింగ్‌ చేస్తున్న దృశ్యాలు చూసిన నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు. ట్రై చేస్తే మీకు ఖచ్చితంగా ఆస్కార్ అవార్డ్ వచ్చేస్తుంది కావాలంటే ట్రై చేయండి అంటూ ట్రోలింగ్‌ చేస్తున్నారు. ఇంకెందుకు ఆలస్యం ఆస్కార్‌ అవార్డ్‌ రేంజ్‌ యాక్టింగ్‌తో పోలీస్‌ స్టేషన్‌లో అల్లరిమూకలు చేసిన స్టంట్‌ మీరూ చూసేయండి.  

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)