నా ఓటమికి ఎన్నో కారణాలు: ఇల్తిజా ముఫ్తీ

Published on Wed, 10/09/2024 - 08:13

శ్రీనగర్‌:  జమ్మూ కాశ్మీర్‌లో పీపుల్స్‌ డెమొక్రటిక్‌ పార్టీ(పీడీపీ) అధ్యక్షురాలు మెహబూబా ముఫ్తీ కుమార్తె ఇల్తిజా ముఫ్తీ అనూహ్యంగా ఓడిపోయారు. ఆమె దక్షిణ కశీ్మర్‌లోని బిజ్‌బెహరా స్థానం నుంచి పోటీచేశారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌ అభ్యర్థి బషీర్‌ అహ్మద్‌ వీరీ చేతిలో పరాజయం చవిచూశారు. తన ఓటమిపై ఇల్తిజా ముఫ్తీ మంగళవారం స్పందించారు. బీజేపీతో గతంలో పీడీపీ పొత్తు పెట్టుకోవడం ఈ ఎన్నికల్లో ఎలాంటి ప్రభావం చూపలేదని అన్నారు. 

తన పరాజయానికి బీజేపీతో అప్పటి స్నేహం కారణం కాదని స్పష్టంచేశారు. తాను ఆశించిన ఫలితం రాలేదని, ఇందుకు చాలా కారణాలు ఉన్నాయని చెప్పారు. నేషనల్‌ కాన్ఫరెన్స్‌కు ఒక అవకాశం ఇచ్చి చూద్దామని ప్రజలు నిర్ణయించుకున్నారని, అందుకే ఆ పార్టీకి ఓటు వేశారని తెలిపారు. తమ నాయకులు, కార్యకర్తలు చాలామంది పీడీపీకి దూరమయ్యారని, దీనివల్ల పార్టీ కొంత బలహీన పడిందని అంగీకరించారు. 

బిజ్‌బెహరా నుంచి గెలిచే అవకాశం తక్కువగా ఉందని తెలిసినప్పటికీ రిస్క్‌ చేశానని ఇల్తిజా ముఫ్తీ వ్యాఖ్యానించారు. రిస్క్‌ చేసినప్పటికీ తగిన ఫలితం రాలేదన్నారు. సురక్షితమైన నియోజకవర్గంలో పోటీ చేసి గెలిస్తే గొప్పేం ఉంటుందని ప్రశ్నించారు. పరాజయం ఎదురైనా కుంగిపోనని, పోరాటం సాగిస్తూనే ఉంటానని తేలి్చచెప్పారు. ఐదేళ్ల తర్వాత రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ పోటీ చేస్తానో లేదో ఇప్పుడే చెప్పలేనని అన్నారు.    

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)