'పిల్లల చనిపోతున్నారు': కన్నీళ్లు పెట్టుకున్న జమ్మూ & కాశ్మీర్ మాజీ సీఎం

Published on Fri, 05/09/2025 - 19:36

భారత్ - పాకిస్తాన్ మధ్య ఉద్రిక్తతలు తీవ్రతరం అవుతున్నాయి. పాక్.. భారత్‌ను రెచ్చగొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో సరిహద్దులో ఉన్న అమాయక ప్రజల ప్రాణాలు కోల్పోతున్నారు. చిన్న పిల్లలు సైతం చనిపోతుండటం ఎంతో బాధాకరమని జమ్మూ & కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి 'మెహబూబా ముఫ్తీ' పేర్కొన్నారు.

పాకిస్తాన్ సైనిక చర్యలపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. పాక్ కాల్పుల్లో పిల్లలు.. మహిళలు మరణిస్తున్నారని అన్నారు. ఆడుకోవాల్సిన వయసులో పిల్లలు ప్రాణాలు కోల్పోతున్నారు. ''అప్పటి వరకు ఆడుకుంటున్న కవలలు.. అంతలోనే ప్రాణాలు కోల్పోయారు''. ఇది ఎంతకాలం కొనసాగుతుంది? జమ్మూ & కాశ్మీర్ ప్రజలు, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతాల్లో నివసించేవారు ఎంతకాలం ఈ బాధను అనుభవించాలి?.. తల్లులకు ఎంతకాలం ఈ కడుపుకోత? అని ప్రశ్నిస్తూ భావోద్వేగానికి గురయ్యారు.

పూంచ్, రాజౌరి, జమ్మూ జిల్లాల్లో పాకిస్తాన్ దళాలు కాల్పులు జరిపాయి. పాక్ కాల్పులకు 16 మంది మరణించారు. ఇందులో ఐదుగురు పిల్లలు, ముగ్గురు మహిళలు ఉన్నారు. ఈ చర్యకు భారత సైన్యం కూడా పాకిస్తాన్ మీద ప్రతీకారం తీర్చుకుంది. పంజాబ్, రాజస్థాన్, గుజరాత్‌లతో పాటు కేంద్రపాలిత ప్రాంతంలోని డ్రోన్లు & క్షిపణులను ఉపయోగించి సైనిక స్థావరాలను లక్ష్యంగా చేసుకోవడానికి పాకిస్తాన్ మరో ప్రయత్నం చేసింది. అయితే వీటన్నింటి కూడా భారత సైన్యం ధ్వంసం చేసింది.

Videos

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)