Breaking News

నా భార్య నిత్య పెళ్లికూతురు

Published on Mon, 01/12/2026 - 07:52

బెంగళూరు: బెంగళూరులో భార్యాభర్తల వివాదం రచ్చకెక్కింది. తనపై ఫిర్యాదు చేసిన భార్యే అసలు మోసగత్తె అని భర్త ఆరోపిస్తున్నాడు. వివరాలు.. తన భర్త ఇంట్లో తల్లిదండ్రులు ముందు నగ్నంగా తిరుగుతాడని, వీడియోలు చూపించి అలా లైంగిక క్రియకు ఒత్తిడి చేస్తాడని మేఘశ్రీ అనే యువతి కేంద్ర మహిళా పోలీస్‌స్టేషన్‌లో ఇటీవల ఫిర్యాదు చేసింది. విల్సన్‌గార్డెన్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో నివసించే వీరికి 3 నెలల కిందటే పెళ్లయింది. 

ఇప్పుడు భర్త మంజునాథ్‌ స్పందిస్తూ మేఘశ్రీ అబద్ధాలు చెబుతోందని, రూ.30 లక్షల నగదు, 50 గ్రాముల బంగారం కోసం తనను బ్లాక్‌మెయిల్‌  చేస్తోందని ఆరోపించాడు. ఆమె నిత్య పెళ్లికూతురని, గతంలో రెండు వివాహాలు చేసుకుందని, భర్తలపై పోలీసులకు ఫిర్యాదులు చేసి విడాకులు తీసుకుని, తనను పెళ్లాడిందని చెప్పాడు.  ఇద్దరూ ఒకే కంపెనీలో పనిచేస్తూ, పరిచయమై వివాహం చేసుకున్నామని మంజునాథ్‌ తెలిపాడు. మేఘశ్రీ స్పందిస్తూ నేను మంజునాథ్‌ నుంచి రూపాయి కూడా తీసుకోలేదని, నాకు రెండు వివాహాలు జరిగిన మాట నిజమని చెప్పింది. భర్త లైంగికంగా తీవ్రంగా వేధిస్తున్నాడని ఆరోపించింది.

సినీ నటి కేసులో మలుపు 
సాక్షి బెంగళూరు: నగరంలో ఓ శాండల్‌వుడ్‌ నటిని నిర్మాత అరవింద్‌ వెంకటేశ్‌ రెడ్డి లైంగికంగా వేధించాడని కేసు పెట్టగా అతనిని పోలీసులు విచారించారు. అయితే ఇద్దరూ సన్నిహితంగా ఉన్న ఫోటోలు ఇప్పుడు ప్రచారంలోకి వచ్చాయి. తనను నటి మోసం చేసినట్లు విచారణలో వెల్లడించినట్లు, ఇందుకు అవసరమైన వారిద్దరు కలిసి ఉన్న ప్రైవేటు ఫోటోను కూడా అందించినట్లు తెలిసింది. తాను ఆమెకు ఖరీదైన బహుమతులు కూడా ఇచ్చినట్లు చెప్పాడు.

 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)