Breaking News

రామాయణం చదివైనా బాగుపడు తల్లీ

Published on Mon, 03/31/2025 - 11:27

ముస్కాన్ రస్తోగీ(muskaan rastogi).. గత పదిరోజులుగా ఇటు మీడియా అటు సోషల్‌ మీడియాలో విపరీతంగా ట్రెండ్‌ అవుతున్న పేరు ఇది.  ప్రాణంగా ఆమెను ప్రేమించిన భర్తను.. గంజాయి మత్తులో ప్రియుడితో కలిసి జోగుతూ ముక్కలు చేసి, ఆపై డ్రమ్ములో ఆమె దాచిన వైనం ‘మీరట్‌ ఉదంతంగా’గా తీవ్ర చర్చనీయాంశమైంది. ‌అయితే ఆమెలో సత్పరివర్తన రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని చెబుతున్నారు ఎంపీ అరుణ్‌ గోవిల్‌.

టీవీ రామాయణంతో అన్ని భాషల ప్రజలకు చేరువైన నటుడు అరుణ్‌ గోవిల్‌.. మీరట్‌ ఎంపీ అనే సంగతి తెలిసిందే కదా. తాజాగా.. ఆదివారం చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు వెళ్లి అక్కడి ఖైదీలకు ఆయన 1,500 రామాయణ ప్రతులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా తన  నుంచి రామాయణం ప్రతి అందుకున్న వెంటనే ముస్కాన్‌ భావోద్వేగానికి గురైందని ఆయన అన్నారు.

‘‘రామాయణం పుస్తకాన్ని(Ramayana Book) అందుకోగానే ఆమె కళ్లలో నీళ్లు తిరిగాయ్‌. ఇది ఆమె జీవితంలో కచ్చితంగా చీకట్లు పారదోలుతుందని చెప్పాను. ఇది చదివైనా జీవితంలో బాగుపడమని.. మంచి మార్పు రావాలని కోరుకుంటున్నట్లు ముస్కాన్‌తో అన్నాను’’ అని అరుణ్‌ గోవిల్‌(Arun Govil) మీడియాకు వివరించారు. ముస్కాన్‌తో పాటు ఈ కేసులో సహా నిందితుడు సాహిల్‌ శుక్లా కూడా రామాయణం అందుకున్నాడట. ఇదిలా ఉంటే.. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంచాలని అరుణ్‌ గోవిల్‌ నిర్ణయించుకున్నారు.ఈ క్రమంలోనే ఇంటింటికీ రామాయణం అనే కార్యక్రమం చేపట్టిన ఆయన.. ఇలా ఖైదీలకూ పంపిణీ చేశారు.

మీరట్‌లో మార్చి 4వ తేదీన సౌరభ్‌ తివారీ హత్య జరిగింది. భర్తను ముక్కలు చేసి డ్రమ్ములో ఉంచి సిమెంట్‌తో సీల్‌ చేసిందామె. ఆపై ప్రియుడితో కలిసి జాలీగా ట్రిప్పులు వేసింది. భర్త మృతదేహాన్ని మాయం చేసే క్రమంలో దొరికిపోతామనే భయంతో తన తల్లిదండ్రులకు ఆమె అసలు విషయం చెప్పింది. దీంతో వాళ్లే ఆమెను దగ్గరుండి పోలీసులకు అప్పజెప్పారు. 

ఈ కేసులో భార్య ముస్కాన్‌, ఆమె ప్రియుడు సాహిల్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. కోర్టు రిమాండ్‌ విధించడంతో చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైలుకు తరలించారు. మొదట్లో తమకు భోజనం వద్దని.. గంజాయి కావాలని.. ఇద్దరినీ ఓకే బ్యారక్‌ ఉంచాలంటూ జైలు సిబ్బందితో గొడవలకు దిగారు వాళ్లు. ఈ క్రమంలో వైద్యుల పర్యవేక్షణలో వాళ్లకు చికిత్స అందింది. అయితే వైద్య పర్యవేక్షణ ముగియడంతో అధికారులు వాళ్లకు పనులు అప్పజెప్పబోతున్నారు. రిమాండ్‌ మీద ఉన్న వీళ్లు.. కోర్టు విచారణ  పూర్తయ్యేదాకా కుట్లు అల్లికలతో ముస్కన్‌, కూరగాయాలు పండిస్తూ సాహిల్‌ గడపబోతున్నారు.

అది ఏఐ జనరేటెడ్‌ వీడియో!
రిమాండ్‌ ఖైదీగా ఉన్న ముస్కాన్‌ ఓ పోలీస్‌ అధికారితో ఏకాంతంగా‌ గడిపినట్లు ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో వైరల్‌ అయ్యింది. అయితే అది నకిలీ వీడియో అని.. తన ప్రతిష్టకు భంగం కలిగించే యత్నమని చెబుతూ సదరు అధికారి ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు.. అది ఏఐ జనరేటెడ్‌ వీడియోగా తేల్చారు. అంతేకాదు.. దానిని అప్‌లోడ్‌ చేసిన అకౌంట్‌ను గుర్తించిన పోలీసులు, దీని వెనుక ఉన్నవాళ్లను ట్రేస్‌ చేసే పనిలో ఉన్నారు. మరోవైపు.. ముస్కాన్‌, సాహిల్‌ పేరిట కూడా కొన్ని వీడియోలు వైరల్‌ అవుతుండడం విశేషం.

Videos

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)