మీరట్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌.. వెలుగులోకి మరో కీలక విషయం

Published on Tue, 04/08/2025 - 07:46

మీరట్‌: మర్చంట్‌ నేవీ అధికారి సౌరభ్‌ రాజ్‌పుత్‌ హత్య కేసులో మరో ట్విస్ట్‌ వెలుగులోకి వచ్చింది. ప్రేమించి వివాహం చేసుకున్న భర్తను ప్రియుడి సాయంతో భార్యే దారుణంగా హత్య చేసి, ముక్కలు చేసిన ఘటన సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. అయితే, ఈ కేసులో తాజాగా మరో షాకింగ్‌ విషయం వెలుగులోకి వచ్చింది. ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న నిందితురాలు ముస్కాన్‌ రస్తోగి గర్భం దాల్చినట్లు సీనియర్ జైలు సూపరింటెండెంట్ వీరేష్ రాజ్ శర్మ వెల్లడించారు.

ముస్కాన్‌కు వైద్య పరీక్షలు నిర్వహించాలని కోరుతూ జైలు అధికారులు సీఎం కార్యాలయాన్ని కోరారు. దీంతో ఇటీవల ఆమెకు గర్భ నిర్థారణ పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలినట్లు చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ అశోక్ కటారియా తెలిపారు. రోజుకో కొత్త విషయం వెలుగులోకి వస్తున్న ఈ హత్య కేసులో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది.

ఈ కేసులో అరెస్టైన ముస్కాన్‌, సాహిల్‌కు సంబంధించి.. గతంలో కూడా పలు కీలక విషయాలను పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వీరిద్దరూ మాదకద్రవ్యాలకు బానిసలుగా మారారని పేర్కొన్నారు. జైల్లో ఆహారం తినకుండా తమకు గంజాయి, మత్తు ఇంజెక్షన్లు ఇవ్వాలని కోరుతున్నట్లు తెలిపారు. అరెస్ట్‌ నాటి నుంచి అవి దొరక్కపోవడంతో విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని.. తరచూ గంజాయి కోసం డిమాండ్‌ చేసినట్లు కూడా పోలీసులు చెప్పారు.

సౌరభ్‌ రాజ్‌పుత్‌(29), ముస్కాన్‌(27) 2016లో ప్రేమ వివాహం చేసుకున్నారు. అతడు మర్చంట్‌ నేవీలో పని చేసేవాడు. వారికి 2019లో కుమార్తె జన్మించింది. ఆ తర్వాత సాహిల్‌(25)తో ముస్కాన్‌ వివాహేతర సంబంధం పెట్టుకొంది. దీనిపై వారు విడాకుల వరకు వెళ్లారు. కానీ, కుమార్తె కోసం సౌరభ్‌ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. తర్వాత ఉద్యోగం నిమిత్తం విదేశాలకు వెళ్లిన అతడు.. ఈ ఏడాది ఫిబ్రవరిలో కుమార్తె పుట్టినరోజు కోసం తిరిగొచ్చాడు. ఇది నచ్చని ముస్కాన్‌.. ప్రియుడితో కలిసి భర్తను హత్య చేసింది. అతడి శరీరాన్ని ముక్కలు చేసి.. వాటిని ఓ డ్రమ్ములో వేసి సిమెంట్‌తో సీల్‌ చేసింది.

 

Videos

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

పవన్ పరువు పాయే.. పావలా సీట్లు కూడా ఇవ్వని లోకేష్.. జనసేన జీరో

YSRCP మేయర్ అభ్యర్థుల జాబితా విడుదల

తాకట్టు వద్దు.. అమ్మేయండి.. మోదీ చెప్పింది నిజమేనా?

స్థానిక ఎన్నికల అభ్యర్థుల రిజర్వేషన్ల అవకతవకలపై పేర్ని నాని స్ట్రాంగ్ రియాక్షన్

JIO ఆవిర్భావంపై ఇషా అంబానీ కామెంట్స్ వైరల్

24 క్రిమినల్ కేసులు బాబుపై రౌడీషీట్ పెట్టాలి

Photos

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)

+5

‘క్రేజీ కళ్యాణం’ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

విజయనగరం : నూతన వధూవరులకు వైఎస్‌ జగన్‌ ఆశ్వీరాదం (ఫొటోలు)