Breaking News

వామ్మో.. ఎక్స్‌ప్రెస్‌వే పై ప్రమాదం.. 5 కి.మీ మేర ట్రాఫిక్‌ జామ్‌

Published on Sat, 07/26/2025 - 19:58

ముంబై:  దేశంలో అత్యంత రద్దీగా ఉండే ఎక్స్‌ప్రెస్‌ వేల్లో ఒకటైన ముంబై-పుణె ఎక్స్‌ప్రెస్‌ వేపై జరిగిన రోడ్డు ప్రమాదంలో 18 నుంచి 20 వాహనాల వరకూ ఒకదానికొకటి ఢీకొన్నాయి. వీటిలో కనీసం మూడు వాహనాల వరకూ పూర్తిగా నుజ్జునుజ్జు కాగా, మరికొన్ని వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. 

శనివారం(జూలై 26) మధ్యాహ్నం వేళ చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో పలువురు గాయపడ్డారు. అంతే కాకుండా ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌ నిలిచిపోయింది. 

లోనావాలా ఖాందార్‌ ఘాట్‌ వద్ద.. ​ ఓ కంటైనర్‌ ట్రక్కు బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ముందున్న వెహికల్‌ను ఢీకొట్టింది. ఇలా కార్లు చైన్‌ సిస్టమ్‌ మాదిరి ఒకదాని వెంటే మరొకటి ఢీకొట్టుకున్నాయి. కంటైనర్‌.. ఒక్కసారిగా బ్రేకులు ఫెయిల్‌ కావడంతో ముందు ఉన్న వాహనాన్ని అత్యంత బలంగా ఢీకొట్టడంతో ఆ వాహనం పూర్తిగా దెబ్బతింది.  ఈ ప్రమాదంపై సమాచారం అందుకున్న రెస్క్యూ టీమ్‌.. సహాయక చర్యలు చేపట్టింది

ఈ ఎక్స్‌ప్రెస్‌ వే పై నిత్యం  లక్షన్నర నుంచి రెండు లక్షల వరకూ వాహనాల రద్దీ ఉంటుంది. అదే వీకెండ్‌లలో అయితే మరింత ఎక్కువగా ఉంటుంది. ఈ రోజు వీకెండ్‌ కావడంతో ఆ రద్దీ మరింత ఎక్కువగా ఉందని స్థానికులు చెబుతున్నారు. అత్యవసర విభాగాలు హుటాహుటీ ఇక్కడకు చేరుకుని గాయపడ్డ వారికి సహాయక చర్యలు చేపట్టాయి. 

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)