Breaking News

Kerala: రైల్వే స్టేషన్‌లో భారీ అగ్ని ప్రమాదం

Published on Sun, 01/04/2026 - 15:31

త్రిసూర్‌: కేరళలోని త్రిసూర్‌ రైల్వేస్టేషన్‌ పార్కింగ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 200కి పైగా బైక్‌లు దగ్ధమయ్యాయి. స్టేషన్‌కు అనుకుని ఉన్న పెయిడ్-పార్కింగ్ ప్రదేశంలో ఇవాళ ఉదయం(ఆదివారం జనవరి 4) 6.45 గంటల సమయంలో మంటలు చెలరేగాయి. కరెంట్‌ తీగ బైక్‌లపై తెగిపడడంతో మంటలు వ్యాపించినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఈ ఘటన ప్లాట్‌ఫాం నంబర్ 2 సమీపంలోని పార్కింగ్ ప్రాంతంలో జరిగింది.

నిత్యం పార్కింగ్‌ షెడ్‌లో 500కిపైగా వాహనాలు పార్కింగ్‌ చేస్తారు. వాహనాల్లోని ఇంధనం కారణంగా మంటలు వేగంగా వ్యాపించడంతో కొన్ని నిమిషాల్లోనే తీవ్ర నష్టం కలిగింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, సుమారు అరగంటలో మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. తమ వాహనాలు బూడిదగా మారిన దృశ్యం చూసి యజమానులు షాక్‌కు గురయ్యారు. అగ్ని ప్రమాదానికి గల కారణాలు నిర్థారణ కాలేదు.

ఈ ప్రమాదం.. విద్యుత్ షార్ట్ సర్క్యూట్, ఇంధన లీక్, ఇతర కారణాల వల్ల జరిగిందా? అన్న కోణాల్లో పోలీసులు విచారణ చేపట్టారు. స్టేషన్‌లోని సీసీటీవీ ఫుటేజ్‌ను పోలీసులు పరిశీలిస్తున్నారు. రైల్వే అధికారులు తెలిపిన వివరాలు ప్రకారం, ఈ ఘటన రైలు సేవలపై ఎలాంటి ప్రభావం చూపలేదు. గురువాయూర్ వైపు వెళ్లే ట్రాక్‌కు సమీపంలోనే పార్కింగ్ ప్రదేశం ఉన్నప్పటికీ, సమయానికి చర్యలు తీసుకోవడంతో రైల్వే మౌలిక వసతులకు మంటలు వ్యాపించలేదు. రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగాయి.

 

Videos

AP: దారుణంగా పెరిగిపోతున్న హత్యలు నెల్లూరులో ఏం జరిగిందంటే..

సంచలనం రేపుతున్న డ్యాన్సర్స్ యూనియన్ వివాదం

అంబానీపై SBI కేసు.. అసలు కారణం ఇదే!

నేను తప్పు చేయలేదు కన్నీరు పెట్టుకున్న కవిత.. ఎందుకంటే..!

కోడిగుడ్లు, టమాటాలతో కోమటిరెడ్డి కార్యాలయంపై దాడి

Nepal Flood: చావు అంచున ప్రాణాలు కాపాడిన అసలైన హీరో!

నీ చరిత్ర మొత్తం బయట పెడితే.. మొహం ఎక్కడ పెట్టుకుంటావో తెలుసా..

బాబుకు ఏపీ కంటే తెలంగాణ అంటేనే ప్రేమ ఎక్కువ..!

ద్రౌపది ముర్ము ADC 'నేషనల్ క్రష్' రిషబ్ సింగ్ రాజీనామా

ఏపీలో మందు బాబులకు బిగ్ షాక్

Photos

+5

పెళ్లి పీటలెక్కనున్న కొత్త జంట (ఫొటోలు)

+5

చెల్లితో కలిసి ప్రకృతి ఒడిలో 'ప్రేమమ్' హీరోయిన్ (ఫొటోలు)

+5

ఈ టాలీవుడ్ హీరోయిన్ గుర్తుందా? బర్త్ డే సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

ట్రెండింగ్‌లో 'రద్ధిమా' సాంగ్.. సాయి-భాగ్యశ్రీ కెమిస్ట్రీ (ఫొటోలు)

+5

వెలిగొండకు జగన్‌ అప్పుడే.. క్రెడిట్‌ ఎవరిదో ఈ ఫొటోలు చూస్తే క్లారిటీ!

+5

Best Photos Of The Week : ఈ వారం ఉత్తమ చిత్రాలు (ఆగస్టు 30- సెప్టెంబర్ 05)

+5

కొత్తింట్లోకి అడుగు పెట్టిన హీరోయిన్.. గృహప్రవేశం (ఫొటోలు)

+5

ఆదివారం విశాఖపట్నం బీచ్ లో ఇలా...(ఫొటోలు)

+5

‘ధర్మస్థల నియోజకవర్గం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ సినిమా ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌...ముఖ్య అతిథిగా విజయ్‌ దేవరకొండ (ఫొటోలు)